ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World cup: ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ రికార్డును బ్రేక్ చేసిన పాకిస్థాన్ స్టార్ పేసర్.. వేగంగా..

ABN, First Publish Date - 2023-10-31T14:38:31+05:30

పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 51 మ్యాచ్‌ల్లోనే ఆఫ్రిదీ ఈ మార్కు అందుకున్నాడు. దీంతో వేగంగా ఈ మార్కు అందుకున్న పాకిస్థాన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.

కోల్‌కతా: పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 51 మ్యాచ్‌ల్లోనే ఆఫ్రిదీ ఈ మార్కు అందుకున్నాడు. దీంతో వేగంగా ఈ మార్కు అందుకున్న పాకిస్థాన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డును బ్రేక్ చేశాడు. స్టార్క్ 52 వన్డే మ్యాచ్‌ల్లో 100 వికెట్లను పూర్తి చేసుకోగా.. షాహీన్ ఆఫ్రిదీ 51 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో 42 వన్డే మ్యాచ్‌ల్లోనే 100 వికెట్లు పడగొట్టిన సందీప్ లమిచానే మొదటి స్థానంలో ఉన్నాడు. 44 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్లు తీసిన అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. కాగా ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ మొదటి ఓవర్లోనే బంగ్లాదేశ్ ఓపెనర్ తాంజిద్ హసన్‌ను షాహీన్ ఆఫ్రిదీ ఔట్ చేశాడు. 5 బంతులు ఆడిన తాంజిద్ హసన్ ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో షాహీన్ ఆఫ్రిదీ 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్టే. మరోవైపు బంగ్లాదేశ్ ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఒకే ఒక్కటి గెలిచింది. మిగతా 3 మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ బెర్త్ దక్కే అవకాశాలు లేవు.

Updated Date - 2023-10-31T14:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising