ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World cup: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు అభిమానులకు గుడ్ న్యూస్

ABN, First Publish Date - 2023-10-11T16:03:04+05:30

వరల్డ్‌కప్‌ ముందు ప్రారంభ వేడుకలు నిర్వహించలేదని నిరాశలో ఉన్న అభిమానులకు గుడ్ న్యూస్. అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 14న జరగనున్న కీలకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ప్రీ మ్యాచ్ వేడుకలను నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోందట.

వరల్డ్‌కప్‌ ముందు ప్రారంభ వేడుకలు నిర్వహించలేదని నిరాశలో ఉన్న అభిమానులకు గుడ్ న్యూస్. అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 14న జరగనున్న కీలకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ప్రీ మ్యాచ్ వేడుకలను నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోందట. ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు ఆడి పాడనున్నారట. ఈ మేరకు పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఈ ప్రీ మ్యాచ్ వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభంకానున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది. టాస్ 1:30 గంటలకు వేస్తారు కాబట్టి కనీసం గంట సేపు ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ స్పెషల్ పోగ్రాం ఉంటుందని సమాచారం. అలాగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి దిగ్గజాలు స్టేడియానికి రానున్నారు. వీరితోపాటు హోంమంత్రి అమిత్ షా కూడా వచ్చే అవకాశాలున్నాయి.


నిజానికి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు బీసీసీఐ ప్రారంభ వేడుకలను నిర్వహిస్తుందని అంతా భావించారు. ఈ వేడుకల్లో ఆశా భోంస్లే, శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్, రణవీర్ సింగ్, తమన్నా భాటియా వంటి కళాకారులు పాల్గొననున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎందుకనో కానీ బీసీసీఐ ఈ వేడుకలను నిర్వహించలేదు. దీంతో బీసీసీఐ తీరుపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ప్రారంభ వేడుకలు నిర్వహించకపోవడం వల్ల టోర్నీకి రావాల్సినంత హైప్ రాలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ప్రీ మ్యాచ్ వేడుకలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-10-11T16:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising