ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs NZ: సూర్యకుమార్ యాదవ్ లేదా అశ్విన్.. కివీస్‌తో సెమీస్ ఫైట్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

ABN, First Publish Date - 2023-11-14T13:59:32+05:30

India vs New Zealand: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో కీలకమైన సెమీ ఫైనల్స్‌కు సమయం ఆసన్నమైంది. బుధవారం భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీస్ పోరు జరగనుంది. సెమీస్‌లో గెలిచి ఫైనల్ చేరి ప్రపంచకప్ టోర్నీని నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్లేయింగ్ 11తో ఆడబోతుందనే ఆసక్తికరంగా మారింది.

ముంబై: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో కీలకమైన సెమీ ఫైనల్స్‌కు సమయం ఆసన్నమైంది. బుధవారం భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీస్ పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. సెమీస్‌లో గెలిచి ఫైనల్ చేరి ప్రపంచకప్ టోర్నీని నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్లేయింగ్ 11తో ఆడబోతుందనే ఆసక్తికరంగా మారింది. నిజానికి గత 5 మ్యాచ్‌లుగా టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయ పడి జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఆ తర్వాతి మ్యాచ్ నుంచి శార్దూల్ ఠాకూర్‌ను కూడా తప్పించి సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీని తుది జట్టులో ఆడిస్తున్నారు. టీమిండియా తుది జట్టులో చివరగా జరిగిన మార్పు ఇదే. ఆటగాళ్లంతా బాగా ఆడుతుండడం, జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉండడంతో మేనేజ్‌మెంట్ కూడా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఒకటి రెండు మార్పులుంటాయని ఆశించినా అలాంటిదేమి జరగలేదు. మొత్తంగా గత 5 మ్యాచ్‌లు జట్టు విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగిస్తోంది. బహుషా సెమీస్‌లోనూ ఇదే జరగొచ్చు.


కానీ పిచ్ పరిస్థితులు, కివీస్‌ టాప్ 8 బ్యాటర్లలో ఏకంగా ఐదుగురు ఎడమ చేతి ఆటగాళ్లు ఉండడంతో ఒక మార్పు జరిగే అవకాశాలున్నాయి. ప్రత్యర్థి బ్యాటింగ్ యూనిట్‌ను దృష్టిలో పెట్టుకుని సూర్యకుమార్ యాదవ్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకొవొచ్చు. ఎందుకంటే ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు ఎడమ చేతి బ్యాటర్లపై మంచి రికార్డు ఉంది. అశ్విన్ జట్టులో వస్తే ఎక్స్‌ట్రా బౌలింగ్ బలం కూడా పెరుగుతుంది. కానీ బ్యాటింగ్ బలం తగ్గే అవకాశాలుంటాయి. అశ్విన్ కూడా బ్యాటింగ్ చేయగలడు కానీ సూర్య స్థాయిలో ఆడలేడు. పైగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో సూర్యకుమార్ యాదవ్ 49 పరుగుల మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి ఈ మార్పు కచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. పైగా ఇప్పటికే ఎడమ చేతి స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా జట్టులో ఉన్నారు. ఒక వేళ కచ్చితంగా ఎక్స్‌ట్రా బౌలర్ కావాలంటే నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఎలాగో బౌలింగ్ చేశారు. అవసరమైతే వీరిని సెమీస్‌లోనూ ఉపయోగించుకోవచ్చు.

దీంతో పిచ్‌పై టర్నింగ్ ఎక్కువగా ఉంటే మాత్రమే అశ్విన్ తుది జట్టులోకి రావొచ్చు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. ఇక బెంచ్‌లో ఉన్న వికెట్ కీపర్, ఎడమ చేతి బ్యాటర్ ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ వారికి తుది జట్టులో చోటు కష్టమే. వికెట్ కీపింగ్ రాహుల్ అద్భుతంగా చేస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్నాడు. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. ఓపెనర్‌గా గిల్ సత్తా చాటుతున్నాడు. దీంతో వీరిని కాదని కిషన్‌కు చోటు దక్కదు. శార్దూల్ ఠాకూర్‌ది కూడా ఇదే పరిస్థితి. ఇక గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణకు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలులేవు. మొత్తంగా సెమీస్ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఒక వేళ జరిగినా ఒకే ఒక మార్పు జరగొచ్చు. గత మ్యాచ్‌లో మాదిరిగానే ఈ సారి కూడా ఆరుగురు ప్రధాన బ్యాటర్లు, నలుగురు ప్రధాన బౌలర్లు, ఒక ఆల్ రౌండర్‌తో టీమిండియా బరిలోకి దిగనుంది.

భారత్ తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

Updated Date - 2023-11-14T14:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising