ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND-A vs PAK-A: పాకిస్థాన్‌ను హడలెత్తించిన సీఎస్కే బౌలర్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం

ABN, First Publish Date - 2023-07-19T18:23:58+05:30

ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాకిస్థాన్-ఏ తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-ఏ బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్(5/42) దుమ్ములేపాడు. తన పేస్‌తో పాక్ బ్యాటర్లను హడలెత్తించాడు. అతనికి స్పిన్నర్ మానవ్ సుతార్(3/36) కూడా సహకరించడంతో పాకిస్థాన్-ఏ జట్టు 205 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 206 పరుగుల మోస్తరు లక్ష్యం ఉంది.

కొలంబో: ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాకిస్థాన్-ఏ తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-ఏ బౌలర్ రాజ్‌వర్ధన్ హంగర్గేకర్(5/42) దుమ్ములేపాడు. తన పేస్‌తో పాక్ బ్యాటర్లను హడలెత్తించాడు. అతనికి స్పిన్నర్ మానవ్ సుతార్(3/36) కూడా సహకరించడంతో పాకిస్థాన్-ఏ జట్టు 205 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 206 పరుగుల మోస్తరు లక్ష్యం ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్-ఏ జట్టును టీమిండియా-ఏ బౌలర్ రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే సైమ్ అయూబ్, ఒమైర్ యూసుఫ్‌ను డకౌట్లు చేశాడు. దీంతో పాకిస్థాన్ జట్టు 9 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(35)ను రియాన్ పరాగ్ పెవిలియన్ చేర్చాడు. కాసేపటి తర్వాత స్పిన్నర్ మానవ్ సుతార్ చెలరేగాడు. వెంట వెంటనే హసీబుల్లా ఖాన్(27), కమ్రాన్ గులాం(15), మహ్మద్ హరీస్(14)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో పాకిస్థాన్ జట్టు 95 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.


ఇలాంటి సమయంలో పాకిస్థాన్‌ను ఖాసిం అక్రమ్(48), ముబాసిర్ ఖాన్(28) ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 53 పరుగుల హాఫ్ సెంచరీ పాట్నర్‌షిప్ నెలకొల్పారు. ఈ పాట్నర్‌షిప్‌ను 38వ ఓవర్లో స్పిన్నర్ నిషాంత్ సింధు విడదీశాడు. ముబాసిర్ ఖాన్‌ను ఔట్ చేశాడు. దీంతో 148 పరుగుల వద్ద పాకిస్థాన్ 7వ వికెట్ కోల్పోయింది. ఖాసిం అక్రమ్, మెహ్రాన్ ముంతాజ్(25) 8వ వికెట్‌కు 43 పరుగులు జోడించారు. మరోసారి చేలరేగిన పేసర్ రాజ్‌వర్ధన్ హంగర్గేకర్.. ఖాసిం అక్రమ్‌ను ఔట్ చేసి ఈ పాట్నర్‌షిప్‌ను 46వ ఓవర్లో బ్రేక్ చేశాడు. ఆ తర్వాతి రెండు వికెట్లను కూడా రాజ్‌వర్ధన్ వెంటవెంటనే తీయడంతో మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్ జట్టు 205 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ 5 వికెట్లు, మానవ్ సుతార్ 3 వికెట్లతో చెలరేగగా.. రియాన్ పరాగ్, నిషాంత్ సింధు తలో వికెట్ తీశారు. కాగా 20 ఏళ్ల రాజవర్ధన్ హంగర్గేకర్ ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో 2 మ్యాచ్‌లాడిన రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ 3 వికెట్లు తీశాడు. కాగా గత ఐపీఎల్ వేలంలో రాజ్‌వర్ధన్ ను చెన్నై జట్టు రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది.

Updated Date - 2023-07-19T18:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising