ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్లు.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా..

ABN, First Publish Date - 2023-11-27T07:35:58+05:30

IND vs AUS 2nd T20: ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరి విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

తిరువనంతపురం: ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరి విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 9 ఫోర్లు, 2 సిక్సులతో యశస్వి జైస్వాల్ 25 బంతుల్లోనే 53 పరుగులు చేయగా.. 3 ఫోర్లు, 4 సిక్సులతో ఇషాన్ కిషన్ 32 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. అలాగే 3 ఫోర్లు, 2 సిక్సులతో రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన జట్టు టాప్ 3 బ్యాటర్లు 50+ స్కోర్లు సాధించడం విశేషం. ఈ రికార్డు సాధించిన టీమిండియా బ్యాటర్లుగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ నిలిచారు. గతంలో ఎంతో మంది సీనియర్లు అందుకోలేని ఈ ఘనతను కుర్రాళ్లు అందుకోవడం గమనార్హం. అలాగే ఓపెనర్లు చెలరేగడంతో పవర్ ప్లేలోనే మన జట్టు 77/1 పరుగులు సాధించింది. దీంతో టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేలో ఆస్ట్రేలియాపై టీమిండియా తన అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. ఈ క్రమంలో గతంలో 2016లో సాధించిన 74/1 రికార్డు బ్రేక్ అయింది.


ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), యశస్వీ జైస్వాల్‌ (25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ధాటికి 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఎల్లి్‌సకు మూడు వికెట్లు దక్కాయి. భారత బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో భారీ ఛేదనలో ఆసీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులకే పరిమితమైంది. స్టొయినిస్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 45), మాథ్యూ వేడ్‌ (23 బంతుల్లో ఓ ఫోర్‌, 4 సిక్సర్లతో 42 నాటౌట్‌), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) ఫర్వాలేదనిపించారు. రవి బిష్ణోయ్‌, ప్రసిద్ధ్‌లకు మూడేసి వికెట్లు లభించాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా యశస్వీ జైస్వాల్‌ నిలిచాడు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ ఆధిక్యం 2-0కి చేరింది.

Updated Date - 2023-11-27T07:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising