Saba Karim: 2004 పాకిస్థాన్ పర్యటనకు ధోనీ ఎందుకు ఎంపిక కాలేదంటే..? ఆసక్తికర విషయాలు బయటపెట్టిన మాజీ సెలెక్టర్
ABN, First Publish Date - 2023-08-05T16:47:13+05:30
తొలి నాళ్లలో ధోని భారత జట్టుకు ఎలా ఎంపికయ్యాడనే విషయాలను నాటి బీసీసీఐ సెలెక్టర్ సబా కరీమ్ తెలిపాడు. ముఖ్యంగా 2004 పాకిస్థాన్ పర్యటన సందర్భంగా నాటి టీమిండియా కెప్టెన్ గంగూలీకి ధోని గురించి చెప్పినట్లు చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తూ నాటి పాక్ పర్యటనకు ధోని ఎంపిక కాలేదు. అయితే దీనికి గల ఆసక్తికర కారణాలను సబా కరీమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మహేంద్రసింగ్ ధోని. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ప్రపంచకప్ విజయాలే. ధోని నాయకత్వంలో టీమిండియా రెండు ప్రపంచకప్‌లు గెలిచింది. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా వికెట్ కీపర్‌గా ధోని తనదైన ముద్ర వేశాడు. అయితే తొలి నాళ్లలో ధోని భారత జట్టుకు ఎలా ఎంపికయ్యాడనే విషయాలను నాటి బీసీసీఐ సెలెక్టర్ సబా కరీమ్ తెలిపాడు. ముఖ్యంగా 2004 పాకిస్థాన్ పర్యటన సందర్భంగా నాటి టీమిండియా కెప్టెన్ గంగూలీకి ధోని గురించి చెప్పినట్లు చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తూ నాటి పాక్ పర్యటనకు ధోని ఎంపిక కాలేదు. అయితే దీనికి గల ఆసక్తికర కారణాలను సబా కరీమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మాజీ సెలెక్టర్ సబా కరీమ్ మాట్లాడుతూ “నేను ఎంఎస్ ధోనిని మొదటిసారి రంజీ ట్రోఫీలో కలిశాను. ధోనికి అది రెండో సీజన్. ఆ సమయంలో ధోని బీహార్ తరపున ఆడేవాడు. ధోని బ్యాటింగ్, కీపింగ్ నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ సమయంలో అతని బ్యాటింగ్ చేసిన విధానం నాకు ఇప్పటికీ గుర్తుంది. బౌలర్ స్పిన్నరైనా, పేసరైనా ధోని మాత్రం దూకుడుగా ఆడేవారు. అయితే వికెట్ కీపింగ్‌లో ఉండాల్సిన ఫుట్‌వర్క్ కాస్త లోపించింది. ఆ సమయంలో నేను ధోనితో మాట్లాడాను. అప్పుడు నేను నేర్పించిన పాఠాలను ధోని ఇప్పటికీ గుర్తుంచుకున్నాడు. అది ఎంఎస్ ధోని కెరీర్‌లో మొదటి టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి వన్డేలలో ధోనిని ఓపెనింగ్ చేయించాం. ధోనీ కూడా వేగంగా పరుగులు సాధించాడు”అని తెలిపాడు.
కెన్యాలో జరిగిన భారత్ ‘ఏ’, పాకిస్తాన్ ‘ఏ’ కెన్యా ముక్కోణపు సిరీస్ ధోనీ కెరీర్‌లో రెండో టర్నింగ్ పాయింట్ అని కరీమ్ చెప్పాడు. అప్పుడు వికెట్ కీపర్‌గా ఉన్న దినేష్ కార్తీక్ జాతీయ జట్టులోకి రావడంతో ఎంఎస్ ధోనీకి భారత్ ఏ తరఫున ఆడే అవకాశం వచ్చింది. అక్కడ ఎంఎస్ కీపింగ్ బాగా చేశాడు. బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అద్భుతంగా రాణించాడు. అప్పుడు భారత జట్టు పాక్ ‘ఎ’తో రెండుసార్లు తలపడింది. ఆ సిరీస్‌లో ధోనీ చాలా బాగా బ్యాటింగ్ చేశాడని కరీమ్ చెప్పుకొచ్చాడు.
"అక్కడి నుంచి ధోనీ కెరీర్ మలుపు తిరిగింది. ఆ సమయంలో ధోనీ పేరు మార్మోగిపోయింది. ఆ సమయంలో నేను కలకత్తాలో ఉన్నాను. అప్పుడు టీమిండియా కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ ఉన్నాడు. అప్పుడు నేను గంగూలీని కలిశాను. ధోనీ అనే ఒక వికెట్ కీపర్ ఉన్నాడు. కీపింగ్, బ్యాటింగ్ చాలా బాగా చేస్తున్నాడు. అతన్ని జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పాను. దురదృష్టవశాత్తు మేము పాకిస్తాన్‌లో పర్యటించే ముందు సౌరవ్ గంగూలీ.. ధోనీ ఆటను చూడలేదు. దీంతో అతను అప్‌కమింగ్ ఆటగాడిపై నమ్మకం ఉంచలేకపోయాడు. దీంతో ధోనీని పాకిస్థాన్ పర్యటనకు ఎంపిక చేయలేదు. కానీ ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ అనతి కాలంలోనే స్టార్ క్రికెటర్‌గా మారాడు. ”అని సబా కరీమ్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ టూర్‌కు ఎంపికైన ధోనీ నిదానంగా జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. కాగా 2004లోనే విశాఖపట్నం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ 123 బంతుల్లోనే 148 పరుగులు చేశాడు.
Updated Date - 2023-08-05T16:47:13+05:30 IST