ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ICC rankings: నాలుగేళ్ల తర్వాత టాప్ 10లోకి ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు.. కెరీర్ బెస్ట్ ర్యాంకులో గిల్!

ABN, First Publish Date - 2023-09-13T15:30:10+05:30

ఆసియా కప్ 2023లో రాణిస్తున్న టీమిండియా బ్యాటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటారు.

ఆసియా కప్ 2023లో రాణిస్తున్న టీమిండియా బ్యాటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటారు. వీరు ముగ్గురు టాప్ 10లో నిలిచారు. ఆసియా కప్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన శుభ్‌మన్ గిల్ ఒక స్థానం ఎగబాకి మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. గిల్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు కాగా.. ప్రస్తుతం వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా ఆటగాళ్ల పరంగా టాప్‌లో ఉన్నది గిలే కావడం గమనార్హం. ప్రస్తుతం గిల్ ఖాతాలో 759 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆసియా కప్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగిన కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలను మెరుగుపరచుకుని 11 నుంచి 9వ ర్యాంకుకు ఎగబాకాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ ఖాతాలో 707 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక పాకిస్థాన్‌పై సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ కూడా రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 717 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. కాగా వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్ 10లో నిలవడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరగా 2018 సెప్టెంబర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ టాప్ 10లో నిలిచారు. ఆ సమయంలో వీరు ముగ్గురు ఏకంగా టాప్ 6లో ఉన్నారు.


కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లోనూ టాప్ 10లో ఉన్నాడు. 759 రేటింగ్ పాయింట్స్‌తో 10వ స్థానంలో కొనసాగతున్నాడు. కాగా ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో టాప్ 10లో టీమిండియా నుంచి రోహిత్ శర్మ ఒక్కడే ఉండడం గమనార్హం. తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో పాకిస్థాన్ నుంచి కూడా ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మొదటి స్థానంలో ఉండగా.. ఇమామ్ ఉల్ హక్ ఐదు, ఫఖర్ జమాన్ పదో ర్యాంకుల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లు టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. ఆసియా కప్‌లో ఇప్పటికే 9 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ ఐదు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఒక స్థానం దిగజారి 9వ ర్యాంకుకు పడిపోయాడు.

Updated Date - 2023-09-13T15:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising