ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs AUS: రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్!

ABN, First Publish Date - 2023-09-24T15:14:06+05:30

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేశాడు.

ఇండోర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్నరెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున ఈ ఏడాది అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మను గిల్ అధిగమించాడు. ఆసీస్ పేసర్ గ్రీన్ వేసిన 10వ ఓవర్ ఐదో బంతిని సిక్సర్ బాదడం ద్వారా గిల్ ఈ రికార్డును అందుకున్నాడు. కాగా ఈ ఏడాది రోహిత్ శర్మ ఇప్పటివరకు 43 సిక్సులు కొట్టగా.. గిల్ తాజాగా 44 సిక్సులకు చేరుకున్నాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ భారత్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక 50+ స్కోర్లు, అత్యధిక ఫోర్లు, అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా కూడా అన్ని రికార్డులను తన పేరు మీదనే లిఖించుకున్నాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. దీంతో 13 ఓవర్లలో భారత్ స్కోర్ వికెట్ నష్టానికి 100 పరుగులకు చేరుకుంది. క్రీజులో ఉన్న శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 8 పరుగులు మాత్రమే చేసి ఆసీస్ పేసర్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇండోర్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి.

తుది జట్లు

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్మాత్ స్మిత్(కెప్టెన్), లబుషేన్, జాస్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, కెమెరాన్ గ్రీన్, సీన్ అబ్బాట్, ఆడమ్ జంపా, జాష్ హజల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్.

ఇండియా: శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్/వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్ధూల్ థాకూర్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ.

Updated Date - 2023-09-24T15:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising