ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs PAK: టాస్ గెలిచిన పాకిస్థాన్.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్!

ABN, First Publish Date - 2023-09-10T14:46:38+05:30

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.

కొలంబో: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కాయిన్ వేయగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్స్ చెప్పాడు. కానీ కాయిన్ టేల్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. నిజానికి తాము టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగే చేయాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌‌లో టీమిండియా రెండు కీలక మార్పులతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చాడు. దీంతో మహ్మద్ షమీ మళ్లీ బెంచ్‌కు పరిమితమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఈ విషయాన్ని టాస్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇది భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. దీంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులో వచ్చాడు. కాగా రెండు జట్ల మధ్య గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డుపడే అవకాశాలున్నాయి. ఒక వేళ ఈ రోజు పూర్తి ఆట సాధ్యం కాకపోతే సోమవారం నాడు రిజర్వ్ డే కూడా ఉంది.


తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్

Updated Date - 2023-09-10T14:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising