ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs PAK: వర్షం కారణంగా నేడు మ్యాచ్ సాధ్యం కాకపోతే ఏం జరుగుతుందంటే..?

ABN, First Publish Date - 2023-09-10T18:39:32+05:30

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 24.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

కొలంబో: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 24.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(56), శుభ్‌మన్ గిల్(58) టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ధాటిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరు మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అయితే వీరిద్దరు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో భారీ వర్షం పడుతోంది. దీంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమవడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి. ఒక వేళ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైతే ఓవర్లు కుదించి ఆడే అవకాశాలున్నాయి. టీమిండియా బ్యాటింగ్ ఇక్కడికే నిలిపివేసి పాకిస్థాన్‌కు లక్ష్యాన్ని అప్పగిస్తే.. 20 ఓవర్లలో ఆ జట్టు 181 పరుగులు చేధించాల్సి ఉంటుందని తెలుస్తోంది.


అలా కాకుండా నేడు ఆట కొనసాగించడం సాధ్యం కాకపోతే సోమవారం రిజర్వ్ డే ఉంది. దీంతో నేడు ఆట ఎక్కడ ఆగిందో, అక్కడి నుంచే సోమవారం మళ్లీ ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. కాగా సూపర్ 4లో ఒక్క భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. మిగతా మ్యాచ్‌లకు లేదు. ప్రసారకర్తలకు ఈ మ్యాచ్ భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఏసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకవేళ సోమవారం కూడా ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దు చేసి రెండు జట్లకు చెరో పాయింట్ ఇవ్వనున్నారు. ఈ మ్యాచ్‌ జరిగే సమయంలో 90 శాతం వర్షం పడే అవకాశాలున్నాయని స్థానిక వాతావరణ అధికారులు సైతం ముందుగానే హెచ్చరించారు. కాగా భారత్, పాకిస్థాన్ మధ్య లీగ్ దశలో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అలాగే జరిగితే అభిమానులకు నిరాశ తప్పదు.

Updated Date - 2023-09-10T20:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising