IND vs SA: తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాను ఊరిస్తున్న మైలుస్టోన్స్ ఇవే!
ABN, First Publish Date - 2023-12-10T09:10:09+05:30
India vs South Africa: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. నేటి నుంచి రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో నేడు జరిగే మొదటి టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇంకా జట్టులో చేరకపోవడంతో సఫారీలతో టీ20 సిరీస్‌లోనూ టీమిండియాను సూర్యకుమార్ యాదవే నడిపించనున్నాడు.
డర్బన్: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. నేటి నుంచి రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో నేడు జరిగే మొదటి టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇంకా జట్టులో చేరకపోవడంతో సఫారీలతో టీ20 సిరీస్‌లోనూ టీమిండియాను సూర్యకుమార్ యాదవే నడిపించనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదే ఊపులో సఫారీలను కూడా ఓడించాలని సూర్య కెప్టెన్సీలోని యువ జట్టు తహతహలాడుతోంది. వరల్డ్ కప్ అనతంరం విశ్రాంతి తీసుకున్న శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ జట్టులో చేరారు. జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ ఇంకా విశ్రాంతిలోనే ఉన్నారు.
సఫారీలతో నేడు జరిగే మొదటి టీ20లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాను పలు మైలుస్టోన్ రికార్డులు ఊరిస్తున్నాయి. వీరిద్దరితోపాటు మరికొందరు భారత ఆటగాళ్లు కూడా మైల్‌స్టోన్స్‌ను చేరుకునే అవకాశాలున్నాయి.
15- అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ ఇప్పటివరకు 1985 పరుగులు చేశారు. మరో 15 పరుగులు చేస్తే 2 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు.
4- అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి రవీంద్ర జడేజా ఇప్పటివరకు 546 వికెట్లు తీశాడు. మరో 4 వికెట్లు తీస్తే 550 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.
1- అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు 49 ఫోర్లు కొట్టాడు. మరొక ఫోర్ కొడితే 50 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు.
13- అన్ని రకాల టీ20 క్రికెట్‌లో తిలక్ వర్మ ఇప్పటివరకు 1987 పరుగులు చేశాడు. మరొక 13 పరుగులు చేస్తే 2 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.
3- అంతర్జాతీయ క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు 47 క్యాచ్‌లు పట్టాడు. మరొక 3 క్యాచ్‌లు పడితే 50 క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు.
5- అన్ని రకాల టీ20 క్రికెట్‌లో వాషింగ్టన్ సుందర్ 95 వికెట్లు తీశాడు. మరొక 5 వికెట్లు తీస్తే 100 వికెట్లు క్లబ్‌లో చేరతాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-10T09:11:24+05:30 IST