ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI: టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే సిరీస్‌కు సిరాజ్ దూరం.. ఎందుకంటే..?

ABN, First Publish Date - 2023-07-27T15:29:11+05:30

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. సిరాజ్ కాలి మడిమ నొప్పితో బాధపడుతున్నాడు. గాయం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా అతనికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.

బార్బడోస్: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. సిరాజ్ కాలి మడిమ నొప్పితో బాధపడుతున్నాడు. గాయం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా అతనికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో అశ్విన్, రహానే, భరత్, నవదీప్ సైనీతోపాటు సిరాజ్ కూడా స్వదేశానికి తిరిగి రానున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. సిరాజ్ స్వల్ప కాలి మడిమ నొప్పితో బాధపడుతున్నాడని, దీంతో ముందు జాగ్రత్త చర్యగా విశ్రాంతి తీసుకోవాలని మెడికల్ టీం సూచించడంతో విశ్రాంతినిచ్చినట్టు తెలిపింది. ప్రస్తుతానికి సిరాజ్ స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేయలేదు. కాగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేకపోవడంతో టీమిండియా పేస్ యూనిట్‌ను సిరాజ్ నడిపిస్తాడని అంతా భావించారు. కానీ ప్రస్తుతం సిరాజ్ కూడా దూరమయ్యాడు. దీంతో అనుభవం లేని జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్‌పైనా పేస్ భారం పడనుంది. అయితే గాయం కారణంగా రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైన పేసర్ శార్దూల్ ఠాకూర్ తొలి వన్డే మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. కాగా విండీస్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ 7 వికెట్లతో రాణించాడు. రెండో టెస్టులో 5 వికెట్లు కూల్చిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.


ఇక భారత్, వెస్టిండీస్ మధ్య మరికాసేపట్లో మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను గెలిచిన జోష్‌లో ఉన్న రోహిత్ సేన వన్డే సిరీస్‌ను కూడా గెలవాలని భావిస్తోంది. అయితే తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లలో ఎవరికి చోటు దక్కుతుందనేది తెలియాల్సి ఉంది. స్పిన్ డిపార్ట్‌మెంట్‌లోనూ గందరగోళం తప్పేలా లేదు. జడేజా, అక్షర్ పటేల్ రూపంలో నిఖార్సైనా స్పిన్ ఆల్‌రౌండర్లు ఉండడంతో ప్రధాన స్పిన్నర్‌గా ఒకరినే తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో చాహల్, కుల్దీప్ యాదవ్‌లలో ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక టెస్టు సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన రుతురాజ్ గైక్వాడ్‌కు వన్డే సిరీస్‌లోనూ అదే పరిస్థితి తప్పకపోవచ్చు.

టీమిండియా స్క్వాడ్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్

Updated Date - 2023-07-27T15:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising