ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: స్వాతంత్య్ర దినోత్సవం నాకు ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే ఈ రోజు మా నాన్న..

ABN, First Publish Date - 2023-08-15T16:20:34+05:30

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వాతంత్య్ర దినోత్సవంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఆగష్టు 15 దేశానికి స్వాతంత్య్ర వచ్చిన రోజుతోపాటు అదే రోజు తన తండ్రి పుట్టిన రోజు కూడా అని కింగ్ కోహ్లీ ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వాతంత్య్ర దినోత్సవంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఆగష్టు 15 దేశానికి స్వాతంత్య్ర వచ్చిన రోజుతోపాటు అదే రోజు తన తండ్రి పుట్టిన రోజు కూడా అని కింగ్ కోహ్లీ ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అందుకే ఆగష్టు 15 తనకు చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. వాళ్ల నాన్న పుట్టిన రోజు కూడా కావడంతో తనకు వ్యక్తిగతంగా ఆగష్టు 15తో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాడు. కాగా ఈ సందర్భంగా కోహ్లీ దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్రమంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన చిన్నతనంలో గాలిపటాలు ఎగురవేసిన ఆనంద క్షణాలను కూడా విరాట్ గుర్తు చేసుకున్నాడు.


"స్వాతంత్య్ర దినోత్సవం మన దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు. ఇది ప్రతి ఏడాది జరుపుకునే కార్యక్రమం. దీనికి చాలా ప్రాముఖ్యత ఉందని నేను భావిస్తున్నాను. నాకు ఇది మరింత ఎక్కువ ప్రత్యేకం. ఎందుకంటే ఇదే రోజు మా నాన్న పుట్టినరోజు. కాబట్టి రెండు సందర్భాలను కలిసి జరుపుకోవడం నాకు చాలా ప్రత్యేకం. కాబట్టి నాకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 1947లో స్వాతంత్య్రం సాధించిన రోజు నుంచి ఈ రోజు ఒక దేశంగా మనం సాధించిన ఘనతను చూసుకుంటే.. నాతో సహా భారతీయులందరూ చాలా గర్వంగా భావించే రోజు అని నేను భావిస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మేము చాలా సార్లు క్రికెట్ ఆడాం. 16 ఆగష్టు 2021న ఇంగ్లండ్‌లో చారిత్రాత్మకమైన లార్డ్స్ టెస్ట్ విజయం ఎంతో ప్రత్యేకమైనది. ఢిల్లీలో ఆగస్ట్ 15న గాలిపటాలు ఎగురవేసే సంస్కృతి ఉంది. అందుకోసం నా చిన్నప్పుడు మేము ముందు రోజు రాత్రి నుంచే అన్ని సిద్ధం చేసుకునేవాళ్లం. దీంతో నాకు ఈ రోజుతో ప్రతేక అనుబంధం ఉంది’’ అని కోహ్లీ తెలిపాడు. కాగా విరాట్ కోహ్లీ నాన్న ప్రేమ్ కోహ్లీ 18 డిసెంబర్ 2006న మరణించాడు.

Updated Date - 2023-08-15T16:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising