IND vs SA: కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌కు పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..?
ABN, Publish Date - Dec 14 , 2023 | 08:10 AM
IND vs SA Pitch Report: సౌతాఫ్రికా పర్యటనలో కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. వర్షం అంతరాయం కల్గించిన రెండో టీ20లో భారత జట్టు విఫలమైంది.
జొహాన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికా పర్యటనలో కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. వర్షం అంతరాయం కల్గించిన రెండో టీ20లో భారత జట్టు విఫలమైంది. దీంతో సిరీస్‌ను కాపాడుకోవాలంటే చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన బ్యాటర్లు బాగానే రాణిస్తున్నప్పటికీ, బౌలర్లు పెదగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ వరకు మన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయాల్సి చేస్తే భారీ స్కోర్‌ను సైతం డిఫెండ్ చేయలేకపోతున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే బౌలర్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అసలు మ్యాచ్ జరగనున్న జొహన్నెస్‌బర్గ్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం.
గత రెండు మ్యాచ్‌ల్లో వర్షం ఇబ్బంది పెట్టింది. కానీ, జొహాన్నెస్‌బర్గ్‌లో ఆ అవాంతరాలు ఉండే అవకాశాలు లేవు. సాయంత్రం వర్షం కురిసే అవకాశాలున్నప్పటికీ మ్యాచ్ సమయానికి వాతావరణం సాధారణంగా మారవచ్చు. మ్యాచ్ జరిగే వాండరర్స్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమే అయినా.. వికెట్‌లో బౌన్స్ ఉండడం పేసర్లకు లాభించే అంశం. దీంతో ఈ మ్యాచ్‌లో పేసర్లు ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇక్కడి బౌండరీ లైన్ పొడవు 65 మీటర్లే కావడంతో భారీ స్కోర్లు నమోదవొచ్చు. గత రికార్డులను బట్టి చూస్తే ఈ వేదికపై టాస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. ఇక్కడ ఇప్పటివరకు 32 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 15 మ్యాచ్‌లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 17 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ స్కోర్ 173గా ఉంది. ఇక జొహన్నెస్‌బర్గ్‌లో అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది. టీ20ల్లో అయితే ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. అయితే టీ20 క్రికెట్‌లో ఇటీవల కాలంలో చేజింగ్ చేసిన జట్లే ఎక్కువ మ్యాచ్‌లు గెలుస్తున్నాయి. ప్రస్తుత టీ20 క్రికెట్ కాలంలో మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించినప్పటికీ డిఫెండ్ చేసుకోవడం కష్టంగా మారుతుంది. బ్యాటింగ్ పిచ్‌లపై ఇది మరింత కష్టం. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగి టీ20 సిరీస్, భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇదే జరిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Updated Date - Dec 14 , 2023 | 08:10 AM