ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI ODI Records: అత్యధిక పరుగులు, వికెట్లు తీసింది ఎవరో తెలుసా? కోహ్లీ రికార్డులు ఏమిటంటే..?

ABN, First Publish Date - 2023-07-26T19:29:02+05:30

భారత్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ఇలా ముగిసిందో లేదో అప్పుడే వన్డే సిరీస్ వచ్చేసంది. గురువారం నుంచి రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. 27, 29, ఆగష్టు 1వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.

బార్బడోస్: భారత్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ఇలా ముగిసిందో లేదో అప్పుడే వన్డే సిరీస్ వచ్చేసంది. గురువారం నుంచి రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. 27, 29, ఆగష్టు 1వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఇప్పటికే టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్ ఫుల్ జోష్‌లో కనిపిస్తుండగా.. టెస్టు సిరీస్ ఓటమికి వన్డేల్లో ప్రతీకారం తీర్చుకోవాలని అతిథ్య వెస్టిండీస్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత్, వెస్టిండీస్ మధ్య గత రికార్డులు ఎలా ఎన్నాయి? అత్యధిక పరుగులు, వికెట్లు తీసిందెవరనే విషయాలను ఒక సారి పరిశీలిద్దాం. కాగా భారత్‌పై వెస్టిండీస్ వన్డే సిరీస్ గెలిచి చాలా కాలమే అవుతుంది.


వన్డే ఫార్మాట్‌లో భారత్, వెస్టిండీస్ ఇప్పటివరకు 139 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ అత్యధికంగా 70 మ్యాచ్‌ల్లో గెలవగా.. విండీస్ 63 మ్యాచ్‌ల్లో గెలిచింది. 6 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. రెండు జట్ల పోటీలో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డు టీమిండియా పేరు మీద ఉంది. 2011లో టీమిండియా 418 పరుగులు చేసింది. అదే సమయంలో వెస్టిండీస్ అత్యధిక స్కోర్ 333గా ఉంది. ఇక టీమిండియా అత్యల్ప స్కోర్ 100 కాగా.. వెస్టిండీస్ అత్యల్ప స్కోర్ 104గా ఉంది. భారత్, విండీస్ పోటీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. కింగ్ కోహ్లీ 2,261 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 157 నాటౌట్. 41 ఇన్నింగ్స్‌ల్లో 66 సగటుతో కోహ్లీ ఈ పరుగులు సాధించాడు. రెండు జట్ల వన్డే పోటీలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరు మీదనే ఉంది. కోహ్లీ 9 సెంచరీలు చేశాడు. 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరు మీద ఉంది. హిట్‌మ్యాన్ 12 సార్లు హాఫ్ సెంచరీ మార్కు అదుకున్నాడు. 3 సెంచరీలు కూడా చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఘనత టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు మీద ఉంది. సెహ్వాగ్ 219 పరుగులు చేశాడు.

ఇక అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ మాజీ పేసర్ కోర్ట్నీవాల్ష్ పేరు మీద ఉంది. వాల్ష్ 44 వికెట్లు తీశాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరు మీద ఉన్నాయి. కుంబ్లే 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. రెండు జట్ల వన్డే పోటీలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. వీరిద్దరు 246 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అత్యధిక క్యాచ్‌లు పట్టింది వీవీ రిచర్డ్స్. 26 క్యాచ్‌లు పట్టాడు. రెండు జట్ల పోటీలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసింది కూడా వీవీ రిచర్డ్సే. 20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. అత్యధిక మ్యాచ్‌లు ఆడింది చంద్రపాల్. 46 మ్యాచ్‌లు ఆడాడు.

Updated Date - 2023-07-26T19:34:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising