నేటి నుంచి వైజాగ్ ఐపీఎల్ టిక్కెట్ల విక్రయం
ABN , Publish Date - Mar 14 , 2025 | 03:56 AM
సాగరతీరంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ ఐపీఎల్‌లో విశాఖపట్నం రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండడం తెలిసిందే. ఈనెల 24 రాత్రి 7.30 గంటలకు...

విశాఖపట్నం ( ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్): సాగరతీరంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ ఐపీఎల్‌లో విశాఖపట్నం రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండడం తెలిసిందే. ఈనెల 24 రాత్రి 7.30 గంటలకు విశాఖలో జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)-లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మ్యాచ్ టిక్కెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో విక్రయించనున్నారు. ఈ సీజన్‌లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను విశాఖలోనే ఆడనుంది. ఈనెల 30వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్న రెండో మ్యాచ్ టిక్కెట్లను ఎప్పటి నుంచి విక్రయించనున్నారో డీసీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి