కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ఘోర అవమానం.. మరీ ఇద్దరేనా..

ABN, First Publish Date - 2023-11-23T11:54:43+05:30

India vs Australia: ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయిందనే బాధ నుంచి అభిమానులు ఇంకా కోలుకోనే లేదు. ఇంతలోనే టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైపోయింది. అది కూడా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ ముగిసిన నాలుగో రోజుల్లోనే కావడం గమనార్హం. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ఘోర అవమానం.. మరీ ఇద్దరేనా..

విశాఖపట్నం: ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయిందనే బాధ నుంచి అభిమానులు ఇంకా కోలుకోనే లేదు. ఇంతలోనే టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైపోయింది. అది కూడా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ ముగిసిన నాలుగో రోజుల్లోనే కావడం గమనార్హం. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. కాకపోతే ప్రపంచకప్ ఆడిన స్క్కాడ్‌లోని ముగ్గురు మాత్రమే ఈ సిరీస్‌లో ఆడనున్నారు. అంటే ఈ సిరీస్‌లో టీమిండియా పూర్తిగా ‘బీ’ టీంతో బరిలోకి దిగనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అటు ఆస్ట్రేలియా కూడా ఈ సిరీస్‌లో దాదాపుగా ‘బీ’ టీంతోనే బరిలోకి దిగుతోంది. కాగా 2021 నుంచి చూసుకుంటే టీ20ల్లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ 9వ కెప్టెన్ కావడం గమనార్హం. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగనుంది.


ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్వహించిన ప్రెస్‌ మీట్‌కు ఇద్దరు జర్నలిస్ట్‌లు మాత్రమే హాజరుకావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో పలువురు అభిమానులు సూర్యకు ఘోర అవమానం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ ప్రెస్ మీట్‌కు జర్నలిస్ట్‌లు ఎవరూ వెళ్లకపోవడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిచడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక ఈ ప్రెస్ మీట్‌లో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ‘‘నేను ఈ రోజు మధ్యాహ్నం స్క్వాడ్‌ను కలిశాను. మైదానంలోకి వెళ్లాక నిస్వార్థంగా ఉండమని మా ఆటగాళ్లకు చెప్పాను. నేను వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించే వ్యక్తిని కాదు. జట్టు కోసం ఆడమని చెప్పాను. 2024 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, మనం ఆడబోయే అన్ని గేమ్‌లు చాలా ముఖ్యమైనవి. మనం నిర్భయంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని జట్టుతో చెప్పినట్టు సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. అలాగే ఇషాన్ కిషన్ బాగా రాణిస్తున్నాడన్న సూర్యకుమార్ యాదవ్ అతడిని జట్టులో కొనసాగిస్తామని చెప్పాడు. ఆసియా కప్, ప్రపంచకప్‌తోపాటు బాగా రాణిస్తున్నాడు. వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-11-23T11:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising