ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MS Dhoni: టీసీ నుంచి వందల కోట్లకు అధిపతి.. ధోనీ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?..

ABN, First Publish Date - 2023-07-08T12:56:33+05:30

మహేంద్రసింగ్ ధోనీ(Mahendra singh Dhoni). క్రికెట్‌లోకి (Cricket) అడుగుపెట్టక ముందు ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తి. కుటుంబ పోషణ కోసం రైల్వే స్టేషన్‌లో టీసీగా(Ticket collector) పని చేశాడు. కుటుంబంతో ఒక అద్దె గదిలో నివాసం ఉన్నాడు. కానీ క్రికెట్ మహేంద్రుడి జీవితాన్ని మార్చేసింది. పేరు ప్రఖ్యాతలతోపాటు వందల కోట్లకు అధిపతిని చేసింది. సరైన టాలెంట్ ఉండి, లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల బలంగా ఉంటే ఒక మనిషి జీవితంలో ఏ స్థాయికి ఎదగగలడనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ధోని.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేంద్రసింగ్ ధోనీ(Mahendra singh Dhoni). క్రికెట్‌లోకి (Cricket) అడుగుపెట్టక ముందు ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తి. కుటుంబ పోషణ కోసం రైల్వే స్టేషన్‌లో టీసీగా(Ticket collector) పని చేశాడు. కుటుంబంతో ఒక అద్దె గదిలో నివాసం ఉన్నాడు. కానీ క్రికెట్ మహేంద్రుడి జీవితాన్ని మార్చేసింది. పేరు ప్రఖ్యాతలతోపాటు వందల కోట్లకు అధిపతిని చేసింది. సరైన టాలెంట్ ఉండి, లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల బలంగా ఉంటే ఒక మనిషి జీవితంలో ఏ స్థాయికి ఎదగగలడనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ధోనీ. తన నైపుణ్యంతో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకోవడంతోపాటు టీమిండియాకు(Team india) మూడు ఐసీసీ ట్రోఫీలు (ICC Trophies) అందించాడు. కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ చెరగని ముద్ర వేశాడు. అయితే ధోనీకి క్రికెట్‌లోనే నైపుణ్యం ఉందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ధోనిలో మంచి బిజినేస్‌మాన్(Businessman) కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆటలోనే కాకుండా సంపాదనలోనూ టాప్‌లోనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని మూడు సంవత్సరాలు గడుస్తున్నా ధోనీ మార్కెట్ విలువ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ఇప్పటిరకు ధోని ఏకంగా 127 మిలియన్ల డాలర్లు సంపాదించాడని అంచనా. ఇది మన భారతదేశ కరెన్సీలో రూ.1,040 కోట్లుగా ఉంటుంది.

వివిధ మార్గాల్లో ధోనీ వార్షిక వేతనం రూ.50 కోట్లకుపైగానే ఉంటుందని సమాచారం. అనేక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ధోనీ 27 మిలియన్ డాలర్లు సంపాదించాడట. ఇప్పటికీ కోకో కోలా, డ్రీమ్ 11, గో డాడీ, రీబాక్, ఓరియో, గల్ఫ్ ఆయిల్, ఇండియా సిమెంట్స్, కోల్గెట్ సియారమ్, టీవీఎస్, ఒప్పోకు ధోనినే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ధోనీ జీవిత చరిత్రగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమా ద్వారా రూ.30 కోట్లు వెనకేశాడని తెలిసింది. ఈ సినిమాలో ధోనీ పాత్రలో దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్( Sushant Singh Rajput) నటించాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(IPL) ప్రస్తుతం ఒక సీజన్‌కు ధోనీకి చెన్నైసూపర్ కింగ్స్(Chennai Super Kings) రూ.12 కోట్లు చెల్లిస్తోంది. గత సీజన్లలో ఇది ఇంకా ఎక్కువగా ఉండేది. కాగా ధోనీ కెప్టెన్సీలోని చెన్నైసూపర్ కింగ్స్ జట్టు గత సీజన్‌లో ట్రోఫిని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ధోనీ అనేక సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టాడు. రితి గ్రూప్, ఖాతాబుక్, 7ఇంక్‌బ్రూస్ కంపెనీలతో పాటు రాంచీలోని హోటల్ మహి రెసిడెన్సీ వంటి వాటిలో ధోనికి పెట్టుబడులు ఉన్నాయి. వ్యాపారాలతో పాటు, వివిధ రంగాలలో క్రీడా జట్లను కూడా కలిగి ఉన్నాడు. ధోనీకి ఇండియన్ సూపర్ లీగ్‌లో చెన్నెయిన్ ఫుట్ బాల్ క్లబ్, హాకీ లీగ్‌లో రాంచీ రేస్ హాకీ టీం, రేసింగ్‌లో మహీ రేసింగ్ టీం కూడా ఉన్నాయి. వీటి ద్వారా ధోని భారీగానే సంపాదిస్తున్నాడు.

ఇక ధోనీ నికర ఆస్తుల విషయానికొస్తే.. ముంబై, పుణేలో ధోనీకి సొంత ఇళ్లు ఉన్నాయి. రాంచీలో 7 ఎకరాల ఫామ్ హౌజ్ ఉంది. అలాగే రాంచీ శివార్లలో మరో 43 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అందులో ధోనీ తనకు ఇష్టమైన సేంద్రీయ వ్యవసాయం చేస్తుంటాడు. అలాగే 2021లో పూణెలోని పింప్రి-చించ్వాడ్ జిల్లాలో ధోనీ ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ధోనీకి కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టం. మార్కెట్లోకి ఎలాంటి కొత్త మోడల్స్ వచ్చినా వెంటనే కొనుగోలు చేస్తుంటాడు. ఇలా కొన్నవి ధోనీ దగ్గర చాలానే ఉన్నాయి. అంతేకాకుండా కొంత కాలం క్రితం సినిమా రంగంలోకి కూడా ధోనీ ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాతగా ఓ ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించాడు. త్వరలోనే తమ నిర్మాణ సంస్థలో వరుసగా సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నాడు. మొత్తంగా పొట్టకూటి కోసం టీసీగా ఉద్యోగం చేసుకునే ధోనిని క్రికెట్ కోటీశ్వరుడిని చేసింది. అంతేకాకుండా ధోనీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచింది.

Updated Date - 2023-07-08T12:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising