IND vs SA: టీమిండియాకు షాక్.. సౌతాఫ్రికాతో సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం?
ABN, First Publish Date - 2023-12-02T16:46:22+05:30
India vs South africa: త్వరలో ప్రారంభంకానున్న సౌతాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు షాక్ తగిలే అవకాశాలున్నాయి. ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో జట్టు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆడడం అనుమానంగా కనిపిస్తోంది.
త్వరలో ప్రారంభంకానున్న సౌతాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు షాక్ తగిలే అవకాశాలున్నాయి. ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో జట్టు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆడడం అనుమానంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ చికిత్స కోసం ముంబైలోని ఆర్థోపెడిక్‌ను కలిశాడని బీసీసీఐ వెల్లడించింది. సెంచూరియన్ వేదికగా జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ నాటికి షమీ పూర్తి ఫిట్‌నెసట్ సాధించకుంటే ఆ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ‘‘ప్రస్తుతం షమీ వైద్య చికిత్స పొందుతున్నాడు. సౌతాఫ్రికాతో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడతాడా? లేదా? అనేది అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే షమీకి అయిన ఈ గాయం మైదానంలో అయింది కాదని సమాచారం. ఆర్థోపెడిక్ దగ్గర చికిత్స పూర్తైన అనంతరం షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు.
కాగా ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లు ఆడనుంది. 10 నుంచి 14 వరకు టీ20 సిరీస్, 17 నుంచి 21 వరకు వన్డే సిరీస్, 26 నుంచి జనవరి 7 వరకు టెస్ట్ సిరీస్ ఆడనుంది. షమీని సెలెక్టర్లు వన్డేలు, టీ20లకు ఎంపిక చేయలేదు. టెస్టు సిరీస్‌కు మాత్రమే ఎంపిక చేశారు. ఇక ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో షమీ దుమ్ములేపాడు. తుది జట్టులోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
టీమిండియా టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.
టీమిండియా టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.
టీమిండియా వన్డే జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యజుర్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ , అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్.
Updated Date - 2023-12-02T16:48:45+05:30 IST