ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prithvi Shaw: టీమిండియాకు ఎంపిక కాకపోవడం పట్ల పృథ్వీ షా ఏమన్నాడంటే..?

ABN, First Publish Date - 2023-08-10T16:13:22+05:30

ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ వన్డే క్రికెట్‌లో అద్భుత డబుల్ సెంచరీ సాధించిన యువ బ్యాటర్ పృథ్వీ షా తాను ప్రస్తుతం టీమిండియాలోకి ఎంపిక కాకపోవడం గురించి ఆలోచించడం లేదని తెలిపాడు. కొంత కాలంగా భారత జట్టులో చోటు ఆశించి నిరాశకు గురవుతున్నా పృథ్వీషా ఇంగ్లండ్‌లోని రాయల్ వన్డే కప్ టోర్నీలో బుధవారం విశ్వరూపం చూపించాడు.

ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ వన్డే క్రికెట్‌లో అద్భుత డబుల్ సెంచరీ సాధించిన యువ బ్యాటర్ పృథ్వీ షా తాను ప్రస్తుతం టీమిండియాలోకి ఎంపిక కాకపోవడం గురించి ఆలోచించడం లేదని తెలిపాడు. కొంత కాలంగా భారత జట్టులో చోటు ఆశించి నిరాశకు గురవుతున్నా పృథ్వీషా ఇంగ్లండ్‌లోని రాయల్ వన్డే కప్ టోర్నీలో బుధవారం విశ్వరూపం చూపించాడు. ఈ టోర్నీలో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల పృథ్వీ షా బుధవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 28 ఫోర్లు, 11 సిక్సులతో 153 బంతుల్లోనే 244 పరుగులు బాదాడు. షా విధ్వంసంతో ఆ మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ జట్టు 87 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.


మ్యాచ్ అనంతరం పృథ్వీ షా మాట్లాడుతూ " నా గురించి టీమిండియా సెలెక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారనే దాని గురించి నేను నిజంగా ఆలోచించడం లేదు. కానీ నేను ఇక్కడ మంచి సమయాన్ని గడపాలనుకుంటున్నాను. నార్తంప్టన్‌షైర్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. వారు నిజంగా నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఆడడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. నార్తంప్టన్‌షైర్ సపోర్టింగ్ స్టాఫ్, ఇక్కడి ఆటగాళ్లతో మంచి సమయం గడుపుతున్నాను. ఈ రోజు వాతావరణం భారత్‌లో మాదిరిగా ఎండగా ఉంది. కాబట్టి ఇది చాలా బాగుంది. ఈ రోజు నా పూర్తి సమార్థ్యాన్ని బయటపెట్టాడు. నేను ఇక ఇతర ఏ విషయాల గురించి ఆలోచించడం లేదు.’’ అని చెప్పుకొచ్చాడు. కాగా కొంతకాలం క్రితం భారత జట్టుకు ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లపై పృథ్వీ షా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సాయి బాబా అంతా చూస్తున్నాడని భావిస్తున్నానని కామెంట్స్ కూడా చేశాడు. కాగా షాను వెస్టిండీస్ పర్యటనతోపాటు ఐర్లాండ్ పర్యటన, ఆసియాగేమ్స్‌కు కూడా సెలెక్టర్లు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. జట్టుకు ఎంపిక కాక పోవడానికి అతని ఫిట్‌నెస్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే తాజాగా కొట్టిన డబుల్ సెంచరీతో అయినా అతనికి టీమిండియాలో చోటు దక్కుతుందేమో చూడాలి.

Updated Date - 2023-08-10T16:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising