ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు నిరసనలు.. ఆ యాడ్ నుంచి తప్పుకోవాలని డిమాండ్!

ABN, First Publish Date - 2023-08-31T20:33:53+05:30

భారత రత్న, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు నిరసన సెగ తగిలింది. ఓ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌నకు సచిన్ ప్రమోషన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనకారులు బాంద్రాలోని ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు.

ముంబై: భారత రత్న, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు నిరసన సెగ తగిలింది. ఓ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌నకు సచిన్ ప్రమోషన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనకారులు బాంద్రాలోని ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు. నిరసనకు దిగిన వారు మహారాష్ట్రలోని స్వతంత్ర ఎమ్మెల్యే అయిన ఓం ప్రకాష్ బాబారావు(బచ్చు కడు) అనుచరులు కావడం గమానార్హం. ఇటీవల సచిన్ పేటీఎం ఫస్ట్(Paytm First Games) అనే ఆన్‌లైన్ గేమ్ కోసం ఓ యాడ్ చేశారు. నిజానికి ఇదొక గేమింగ్ యాప్(gaming app). ఇందులో గేమ్స్ ఆడడమే కాకుండా డబ్బులు కూడా పెట్టొచ్చు. తద్వారా డబ్బులు సంపాదించడమే కాకుండా పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వీటిని ఫాంటసీ గేమ్స్ అని పిలుస్తున్నప్పటికీ.. ఒక రకంగా ఇది కూడా జూదమే అని చెప్పుకోవాలి.


ఇలాంటి గేమింగ్ యాప్‌ను సచిన్ ప్రమోట్ చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఆ యాడ్ ప్రమోషన్ నుంచి సచిన్ తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరసనలకు దిగిన ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒక వేళ సచిన్ భారతరత్న గ్రహీత కాకపోయి ఉంటే తాము ఆందోళన చేసే వాళ్లం కాదని నిరసనకారులు తెలిపారు. భారతరత్న అయిన సచిన్ ఇలాంటి ఆన్‌లైన్ గేమ్స్‌ను ప్రోత్సహించడం మానేయాలని అన్నారు. లేదంటే తన భారతరత్నను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ యాడ్‌లో నటించడంపై సచిన్‌కు తాము ఇప్పటికే నోటీసులు కూడా పంపిచినట్లు ఆందోళనకారులు తెలిపారు. ఆగష్టు 30 వరకు సమయం ఇచ్చినా సచిన్ స్పందించలేదన్నారు. దీంతో మరోసారి నోటీసులు పంపించనున్నట్లు చెప్పారు. "ఎంతో మంది అభిమానులు, భారతరత్న అవార్డు కల్గిన సచిన్ టెండూల్కర్ Paytm ఫస్ట్ వంటి జూదం యాప్‌ను ప్రచారం చేయడం సరికాదు. దయచేసి ఈ ప్రకటనను వెంటనే నిషేధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం, సచిన్ టెండూల్కర్‌ను నేను అభ్యర్థిస్తున్నాను" అని ఓం ప్రకాష్ బాబారావు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.

Updated Date - 2023-08-31T20:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising