ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Pics: రవీంద్ర జడేజా చేతికి ఏం పూశాడంటే...వివరణ ఇచ్చిన టీం ఇండియా

ABN, First Publish Date - 2023-02-10T08:52:16+05:30

నాగపూర్ టెస్ట్ మొదటిరోజు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా పెయిన్ రిలీఫ్ క్రీమ్ పూసిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ ...

Ravindra Jadeja Used Pain Relief Cream
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగపూర్ : నాగపూర్ టెస్ట్ మొదటిరోజు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా పెయిన్ రిలీఫ్ క్రీమ్ పూసిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.రవీంద్ర జడేజా తన బౌలింగ్ చేతి చూపుడు వేలికి నొప్పి నివారణ క్రీమ్‌ను ఉపయోగించినట్లు టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు సమాచారం అందించింది.(Ravindra Jadeja Used Pain Relief Cream)

నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం జరిగిన మొదటి టెస్ట్ మొదటి రోజు గుర్తుండిపోతుంది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌ను 177 పరుగులకు కట్టడి చేసేందుకు జడేజా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ జడేజా తన చేతిపై ఏదో పదార్థాన్ని పూసినట్లు చూపే విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి : Turkey Syria earthquake: క్షతగాత్రురాలైన టర్కీ బాలికకు ఇండియన్ ఆర్మీ వైద్యుల చికిత్స

నాగ్‌పూర్ టెస్ట్ తొలి రోజు తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్‌లలో జడేజా తన బౌలింగ్ చేతి చూపుడు వేలుకు నొప్పి నివారణ క్రీమ్‌ను ఉపయోగిస్తున్నట్లు టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఇప్పుడు ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు తెలియజేసింది.(Rohit Sharma Informs ICC)వీడియో ఫుటేజీలో జడేజా తన కుడి చేతితో మహ్మద్ సిరాజ్ అరచేతి నుంచి పెయిన్ రిలీఫ్ క్రీమ్ తీయడం కనిపించింది.

ఇది కూడా చదవండి : Layoff: యాహూలోనూ ఉద్యోగాల కోత...1000మంది ఉద్యోగుల తొలగింపు

జడేజా బౌల్ చేసే ముందు క్రీమ్ ను అతని ఎడమ చేతి చూపుడు వేలుకు,అతని బౌలింగ్ చేయిపై రుద్దినట్లు కనిపించింది. బంతికి లాలాజలాన్ని కూడా ఉపయోగించకూడదని ఐసీసీ నిషేధించింది.జడేజా అప్పటికే మార్నస్ లాబుషాగ్నే, మాట్ రెన్షా, స్టీవెన్ స్మిత్‌లను అవుట్ చేశాడు.మొదటి రోజు ఆట ముగిసిన వెంటనే జడేజాతో పాటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు మేనేజర్‌కు జడేజా చర్యల వీడియో క్లిప్ చూపించారు.ఈ విషయాన్ని ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకెళ్లలేదు. ఆట పరిస్థితుల ప్రకారం ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా మ్యాచ్ రిఫరీ స్వతంత్రంగా ఇలాంటి సంఘటనలను విచారించవచ్చు.

Updated Date - 2023-02-10T09:18:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising