Rohit Sharma: ఫ్యాన్సందు రోహిత్ శర్మ ఫ్యాన్సే వేరయా! ఆసియా కప్ & వరల్డ్ కప్‌నకు వినూత్నంగా విషెస్
ABN, First Publish Date - 2023-08-27T19:42:58+05:30
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉండే అభిమాన ఘనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హిట్‌మ్యాన్ ఎక్కడికెళ్లినా అభిమానులు ఎగబాడతారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉండే అభిమాన ఘనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హిట్‌మ్యాన్ ఎక్కడికెళ్లినా అభిమానులు ఎగబాడతారు. రోహిత్ ఫామ్‌లో ఉన్నా, లేకపోయినా వారి అభిమానం మాత్రం తగ్గదు. అయితే త్వరలో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు వినూత్న రీతిలో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం విశేషం. టీమిండియా ఆసియా కప్, ప్రపంచకప్ గెలవాలని ఆశిస్తూ కర్ణాటకలోని రోహిత్ అభిమానులు ఓ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజనం, పండ్లు పంచారు. అనంతరం వారితో కలిసి రోహిత్ శర్మకు టీమిండియాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు ఫోటోలో రోహిత్ శర్మ ప్రపంచకప్‌ను పట్టుకుని ఉన్న బ్యానర్‌ను కూడా అభిమానులు ప్రదర్శించారు. ఫోటోలో వృద్ధులతోపాటు చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోను చూసిన నెటిజన్లు హిట్‌మ్యాన్ అభిమానులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు నెటిజన్లు ‘ఫ్యాన్సందు రోహిత్ శర్మ ఫ్యాన్సే వేరయా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటుంది.
టీమిండియా ఆసియా కప్ స్క్వాడ్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Updated Date - 2023-08-27T19:46:18+05:30 IST