ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోహిత్ శర్మ టీం vs కపిల్ దేవ్ టీం.. 1983 టీమిండియాతో పోలిస్తే 2023 టీమిండియా ఎలా ఉంది?

ABN, First Publish Date - 2023-06-26T11:03:35+05:30

భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచకప్ గెలిచి ఆదివారానికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు నాటి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే. అదేటంటే ప్రస్తుతం ఉన్న టీమిండియాకు ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను గెలిచే సత్తా ఉందా? ఈ క్రమంలో భారత అభిమానులు 1983లోని కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియాను, ప్రస్తుత 2023లోని రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియాను పోల్చి చూస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచకప్ గెలిచి ఆదివారానికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు నాటి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే. అదేటంటే ప్రస్తుతం ఉన్న టీమిండియాకు ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను గెలిచే సత్తా ఉందా? ఈ క్రమంలో భారత అభిమానులు 1983లోని కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియాను, ప్రస్తుత 2023లోని రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియాను పోల్చి చూస్తున్నారు. కపిల్ దేవ్ నాయకత్వంలోని టీం ప్రపంచకప్ గెలిచి తమది ఎంత బలమైన జట్టో చాటి చెప్పింది. ఈ క్రమంలో ప్రస్తుత రోహిత్ శర్మ టీంను కపిల్ దేవ్ టీంతో పోలిస్తే ఎలా ఉంది? ఉన్న బలహీనతలేమిటి? రెండు టీంల మధ్య ఉన్న తేడాలేంటి? ప్రపంచకప్ గెలవాలటే ఏం చేయాలనే అంశాలను ఒక సారి పరిశీలిద్దాం.

ఆల్‌రౌండర్లు

ప్రస్తుతం ఉన్న రోహిత్ శర్మ టీంకు, నాటి కపిల్ దేవ్ టీంకు ప్రధాన తేడా ఆల్‌రౌండర్లు. 1983 ప్రపంచకప్ గెలవడంలో ఆల్‌రౌండర్లు కపిల్ దేవ్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, అమర్నాథ్ కీలకపాత్ర పోషించారు. ఇటు బ్యాటుతో అటు బాల్‌తో వీరు చెలరేగారు. ముఖ్యంగా కెప్టెన్ కపిల్ దేవ్ అద్భుత కెప్టెన్సీతోపాటు తన ఆల్‌రౌండ్ షోతో టీంను ముందుండి నడిపించాడు. అయితే ప్రస్తుత రోహిత్ శర్మ టీంలో ఆ స్థాయి నాణ్యమైన ఆల్‌రౌండర్లు కనిపించడంలేదు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే ప్రపంచకప్ జరిగేది స్పిన్ పిచ్‌లుండే మన దేశంలో కాబట్టి జడేజాకు తోడుగా మరో స్పిన్ ఆల్‌రౌండర్ ఉంటే బాగుంటుంది.

గాయాలు

కపిల్ దేవ్ టీంలో ఆటగాళ్లంతా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారు. ప్రపంచకప్‌ కోసం సిద్ధం చేసుకున్న ఆటగాళ్లు టోర్నీ ప్రారంభం నాటికి జట్టుకు అందుబాటులో ఉన్నారు. కానీ ప్రస్తుత రోహిత్ శర్మ టీంకు అలాంటి పరిస్థితులు కనిపించడంలేదు. గాయాలతో ఏ ఆటగాడు ఎప్పుడు జట్టుకు దూరమవుతాడో చెప్పలేని పరిస్థితి. ప్రధానంగా ప్రపంచకప్ కోసమే ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆటగాళ్లు టోర్నీ ఆరంభమయ్యే నాటికి గాయాలతో జట్టుకు దూరమవుతున్నారు. దీంతో అప్పటికప్పుడు మరో ఆటగాడితో ఆ స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యపడడంలేదు. ఉదాహరణకు గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌నే తీసుకుంటే.. ఆ టోర్నీలో కీలకంగా వ్యవహరిస్తారనే ఉద్దేశ్యంతో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాను బీసీసీఐ ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. కానీ టోర్నీ ఆరంభమయ్యే సమయానికి వీరిద్దరు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. జడేజా, బుమ్రా లేని లోటు ఆ ప్రపంచకప్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌నకు ముందు కూడా టీమిండియా పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికే కీలక ఆటగాళ్లైనా జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ గాయాలతో జట్టుకు దూరంగా ఉంటున్నారు. ప్రపంచకప్ ఆరంభమయ్యే నాటికి వీరు కోలుకుంటారో లేదో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ వీరు కనుక ప్రపంచకప్‌నకు అందుబాటులో లేకపోతే ఆ ప్రభావం జట్టు విజయావకాశాలపై పడనుంది.

కీలక సమయాల్లో రాణించలేకపోవడం

కపిల్ దేవ్ టీంలోని ఆటగాళ్లంతా కీలక సమయాల్లో రాణించేవారు. జట్టు అవసరాలకు తగిన విధంగా బ్యాట్, బంతితో తమ సత్తా చూపించారు. కానీ ప్రస్తుత రోహిత్ శర్మ టీంలో ఇది లోపించింది. స్టార్ ఆటగాళ్లుగా భావించినవారు కీలక సమయాల్లో, ముఖ్యంగా నాకౌట్ పోరులో రాణించలేకపోతున్నారు. నిజానికి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచి టీమిండియాలో ఈ సమస్య ఉంది. 2014 ఫైనల్, 2015, 2019, 2022 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం ఇదే. నాకౌట్ పోరులో మన స్టార్ ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఖాళీ చేతులతోనే ఇంటికి రావాల్సి వచ్చింది.

ఒత్తిడి

నాడు కపిల్ దేవ్ టీంపై లేనిది. నేడు రోహిత్ శర్మ టీంపై ఉన్నది ఒత్తిడి. అవును ఈ రెండు టీంల మధ్య ఉన్న ప్రధాన తేడా ఇదే! 1983లో భారత జట్టు ప్రపంచకప్ ఆడుతున్నప్పుడు టీంపై ఎలాంటి అంచనాలు లేవు. ఆ ప్రపంచకప్‌లో భారత జట్టు ఒక్క మ్యాచ్ గెలిచినా అదే ఎక్కువ అనుకున్నారంతా.. పైగా అప్పట్లో దేశంలో క్రికెట్‌ గురించి తెలిసింది తక్కువ మందికే. కానీ నేడున్న రోహిత్ శర్మ టీంది పూర్తి భిన్నం. ప్రపంచంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీం మనదే. ఇంకేముంది మన టీం ఏ చిన్న మ్యాచ్ ఆడిన సరే అభిమానులతో స్టేడియాలు నిండిపోతున్నాయి. ఇక టీవీలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మ్యాచ్‌లు చూసే సంఖ్య అపరిమితం. అలాంటిది ప్రపంచకప్ వంటి టోర్నమెంట్లలో ఆడినప్పుడు టీమిండియాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. దీంతో తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో గెలిచినప్పుడు పర్వాలేదు కానీ, ఓడితేనే అసలు సమస్య. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ప్రతి చిన్నతప్పును వేలెత్తి చూపిస్తుండడంతో ఆటగాళ్లు ఒత్తిడిలో పడిపోతున్నారు. కపిల్ దేవ్ టీంకు, రోహిత్ శర్మ టీంకు మధ్య ప్రధానంగా ఉన్న తేడాలివే! ఈ సమస్యలను కనుక రోహిత్ శర్మ టీం అధిగమిస్తే ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ను గెలవడం పెద్దగా కష్టమేమి కాకపోవచ్చు.

Updated Date - 2023-06-26T11:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising