IND vs WI: వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ, జడేజాను ఊరిస్తున్న రికార్డులివే!..
ABN, First Publish Date - 2023-07-26T21:24:50+05:30
గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. బార్బడోస్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లను పలు రికార్డులను ఊరిస్తున్నాయి. రికార్డులు అందుకోనున్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతోపాటు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు.
బార్బడోస్: గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. బార్బడోస్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. రికార్డులు అందుకోనున్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతోపాటు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు. ఆ రికార్డులేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. వన్డేల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 12,898 పరుగులు చేశాడు. మరొక 102 పరుగులు చేస్తే 13 వేల పరుగుల మైల్‌స్టోన్ రికార్డును కోహ్లీ చేరుకుంటాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకు 9,825 పరుగులు చేశాడు. మరొక 175 పరుగులు చేస్తే వన్డేల్లో 10 వేల పరుగుల ల్యాండ్ మార్కు రికార్డును అందుకుంటాడు. ఇప్పటివరకు వెస్టిండీస్‌పై స్పిన్నర్ రవీంద్ర జడేజా 41 వికెట్లు తీశాడు. కాగా మరొక 3 వికెట్లు తీస్తే వన్డేల్లో విండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో జడేజా.. కపిల్ దేవ్‌ను(43) అధిగమిస్తాడు. అలాగే మరొక 4 వికెట్లు తీస్తే భారత్, వెస్టిండీస్ వన్డే పోటీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. అలాగే మహ్మద్ సిరాజ్ మరో 7 వికెట్లు తీస్తే వన్డేల్లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. గిల్ మరొక 21 పరుగులు చేస్తే 2,500 పరుగులను పూర్తి చేసుకుంటాడు.
వెస్టిండీస్ వన్డే స్క్వాడ్:
షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షిమ్రాన్ హెట్‌మేయర్, అలిక్ అథానాజ్, రోవ్‌మన్ పావెల్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, డొమినిక్ డ్రేక్, యానిక్ కరియా
భారత్ వన్డే స్క్వాడ్:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్
Updated Date - 2023-07-26T21:24:50+05:30 IST