ODI World Cup 2023: ప్రపంచకప్‌కు జట్టు ప్రకటన.. కానీ ఇంతలోనే ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!
ABN, First Publish Date - 2023-09-05T17:23:13+05:30
భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. కానీ ఇంతలోనే సౌతాఫ్రికా బోర్డుకు, ఆ జట్టు అభిమానులకు బిగ్ షాక్ తగిలింది.
భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. కానీ ఇంతలోనే సౌతాఫ్రికా బోర్డుకు, ఆ జట్టు అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ ప్రపంచకప్ తర్వాత వన్డేల నుంచి రిటైర్ అవ్వనున్నట్టు ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా కూడా ధృవీకరించింది. డికాక్ రిటైర్మెంట్ అంశంపై సౌతాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ ఈనాక్ ఎన్క్వే మాట్లాడుతూ.. జట్టుకు డికాక్ ఎనలేని సేవ చేశాడని కొనియాడాడు. తన అటాకింగ్ బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా క్రికెట్‌లో బెంచ్ మార్క్ సెట్ చేశాడని ప్రశంసించాడు. కాగా భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో డికాక్‌కు కూడా చోటు దక్కింది. ఇక 30 ఏళ్ల డికాక్ ఇప్పటికే టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ప్రపంచకప్ తర్వాత వన్డేల నుంచి కూడా తప్పుకోనున్న డికాక్.. టీ20ల్లో కొనసాగే అవకాశాలున్నాయి. తన కెరీర్‌లో ఇప్పటివరకు 140 వన్డే మ్యాచ్‌లు ఆడిన డికాక్ 44 సగటుతో 5,966 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక వికెట్ కీపర్‌గా 197 మందిని ఔట్ చేశాడు. ఇందులో 183 క్యాచ్‌లు, 14 స్టంపింగ్‌లున్నాయి. 8 వన్డే మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికాకు కెప్టెన్‌గా కూడా చేశాడు.
వన్డే ప్రపంచకప్‌నకు ఎంపికైన సౌతాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగల, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, తబ్రైజ్ షంషి.
Updated Date - 2023-09-05T17:27:14+05:30 IST