World Cup: టీమిండియాకు చావు దెబ్బ.. ప్రపంచకప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం
ABN, First Publish Date - 2023-11-04T10:50:28+05:30
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అందరికంటే ముందుగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియాకు చావుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అందరికంటే ముందుగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియాకు చావుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకోకపోవడంతో ప్రపంచకప్ మొత్తానికి దూరమవుతున్న ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఇది గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోగానే చెప్పుకోవాలి. పలువురు క్రీడా విశ్లేషకులైతే ఇది టీమిండియాకు చావు దెబ్బగా విశ్లేషిస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గత నెల 19న పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తాను వేసిన మొదటి ఓవర్ మూడో బంతిని బంగ్లాదేశ్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాటో స్ట్రేట్‌గా కొట్టాడు. ఆ బంతిని ఆపేందుకు కాలిని అడ్డుగా పెట్టిన హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. దీంతో వెంటనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. హార్దిక్ కోలుకుంటున్నాడని లీగ్ దశలోని చివరి మ్యాచ్‌లకు లేదంటే సెమీ ఫైనల్ మ్యాచ్ నాటికి కచ్చితంగా జట్టులో చేరతాడని మొదట వార్తలు వచ్చాయి. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనుండడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
నిజానికి ఇప్పటికిప్పుడు జట్టులో హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయం లేదు. హార్దిక్ లాంటి నమ్మకమైన మరో పేస్ ఆల్‌రౌండర్ జట్టులో లేడు. దీంతో మిగతా మ్యాచ్‌ల్లో హార్దిక్ లేని లోటు స్పష్టంగా కనిపించనుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా లోటును టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఇద్దరు ఆటగాళ్లతో భర్తీ చేస్తోంది. హార్దిక్ లేకపోవడంతో టీమిండియా తుది జట్టులోకి మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకున్నారు. ఇక మొత్తంగా హార్దిక్ పాండ్యా దూరం కావడంతో అతని స్థానంలో యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ టీమిండియా స్క్వాడ్‌లోకి రానున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ వెంటనే టీమిండియాతో కలవనున్నాడు. ఈ నెల 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో సౌతాఫ్రికాతో భారత్ ఆడే మ్యాచ్‌కు ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో ఉండనున్నాడు. కాగా ఈ టోర్నీకి ముందు ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సరీస్‌తోపాటు అంతకుముందు జరిగిన ఆసియాకప్‌లోనూ ఆడాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫిలో కర్ణాటక తరఫున కూడా ఆడాడు. ఆ టోర్నీలో ఆకట్టుకున్నాడు. తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల ప్రసిద్ధ్ కృష్ణ 29 వికెట్లు తీశాడు.
Updated Date - 2023-11-04T10:50:29+05:30 IST