ఐర్లాండ్ పర్యటనకు బుమ్రా, శ్రేయస్?.. ప్రస్తుతం వీరి ఫిట్‌నెస్ ఎలా ఉందంటే..?
ABN, First Publish Date - 2023-07-16T12:21:16+05:30
టీమిండియాకు గుడ్ న్యూస్. గాయాల కారణంగా కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), శ్రేయస్ అయ్యర్ త్వరలోనే భారత జట్టులో చేరనున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (National Cricket Academy in Bengaluru) కోలుకుంటున్న వీరిద్దరు దాదాపుగా పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లుగా సమచారం అందుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా, శ్రేయస్ వచ్చే నెలలో జరగనున్న ఐర్లాండ్ (Ireland) పర్యటనలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
టీమిండియాకు గుడ్ న్యూస్. గాయాల కారణంగా కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), శ్రేయస్ అయ్యర్ త్వరలోనే భారత జట్టులో చేరనున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (National Cricket Academy in Bengaluru) కోలుకుంటున్న వీరిద్దరు దాదాపుగా పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లుగా సమచారం అందుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా, శ్రేయస్ వచ్చే నెలలో జరగనున్న ఐర్లాండ్ (Ireland) పర్యటనలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎన్సీఏలో(NCA) ఉన్న బుమ్రా, శ్రేయస్ అయ్యర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. బుమ్రా ప్రతి రోజు 8 నుంచి 10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడని సమాచారం. గత మార్చిలో వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న బుమ్రా అప్పటి నుంచి ఎన్సీఏలో కోలుకుంటున్నాడు. ఆరంభంలో ప్రతి రోజు 5 నుంచి 6 ఓవర్ల కోటా బౌలింగ్ వేసిన బుమ్రా క్రమంగా దానిని పెంచుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం 10 ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే ఎన్సీఏలో నిర్వహించే ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో బుమ్రా పాల్గొననున్నాడని తెలుస్తోంది.
బుమ్రాతో మరో స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా కోలుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఎన్సీఏలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నాడని తెలిసింది. శ్రేయస్ కూడా ఎన్సీఏలో నిర్వహించే ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలున్నాయి. దీంతో రానున్న వన్డే ప్రపంచకప్‌లో బుమ్రా, అయ్యర్ ఆడడం ఖాయమనే చెప్పుకోవాలి. వీరిద్దరు ఆసియా కప్ (Asia Cup) నాటికి జట్టులో చేరతారని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అంతకంటే ముందుగానే ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టులో బుమ్రా, శ్రేయస్ ఉండే అవకాశాలున్నాయి. కాగా భారత జట్టు వచ్చే నెలలో టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటించనుంది. బుమ్రా, శ్రేయస్‌తోపాటు ఎన్సీఏలో ఉన్న యువ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) కూడా దాదాపుగా కోలుకున్నట్లు సమాచారం అందుతోంది. అతను కూడా ఎన్సీఏలో బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ కూడా త్వరలోనే భారత జట్టులో చేరనున్నాడు. కాగా ఎన్సీఏలోనే కోలుకుంటున్న కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఫిట్‌నెస్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే రాహుల్ ప్రపంచకప్ నాటికి జట్టులో చేరతాడని తెలుస్తోంది. ఇక రిషబ్ పంత్ విషయానికొస్తే ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉండడం అనుమానమేనని సమాచారం. ఏది ఏమైనా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా, శ్రేయస్, రాహుల్, పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. వీరు నలుగురు కనుక జట్టులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండే అవకాశాలు ఉండేవి.
Updated Date - 2023-07-16T12:21:16+05:30 IST