India Vs NewZealand: ఉప్పల్ స్టేడియంలో ఇండియా Vs న్యూజిలాండ్ మ్యాచ్ టికెట్ల విక్రయ తేదీ ప్రకటన
ABN, First Publish Date - 2023-01-11T20:12:39+05:30
నగరంలోని ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో (Uppal International Stadium) దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల 18న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (India Vs New Zealand) మధ్య వన్డే మ్యాచ్ (One day Match) జరగనుంది.
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో (Uppal International Stadium) దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల 18న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (India Vs New Zealand) మధ్య వన్డే మ్యాచ్ (One day Match) జరగనుంది. మ్యాచ్ టికెట్లను 13 నుంచి ఆన్‌లైన్ (Online) వేదికగా విక్రయించనున్నట్టు హెచ్‌సీఏ (HCA) అధ్యక్షుడు అజహారుద్దీన్ (Mohammad Azharuddin) ప్రకటించారు. పేటీఎం (Paytm) ప్లాట్‌ఫామ్‌పై టికెట్స్ కొనుగోలు (Ticket sales) చేయొచ్చని తెలిపారు.
ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నవారు ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలిలో జనవరి 15 నుంచి ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్ తీసుకోవచ్చునని వెల్లడించారు. ఫిజికల్ టికెట్ ఉంటేనే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించామని, బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని వివరించారు.
ఆన్‌లైన్ టికెట్లను 13 నుంచి 16 వరకు విడతల వారీగా అమ్మకాలు చేపట్టనున్నామని అజారుద్దీన్ తెలిపారు. జనవరి 13న రూ.6 వేల టికెట్లు, జనవరి 14-15 తేదీల్లో రూ.7 వేల టికెట్లు, జనవరి 16న మిగతా టికెట్స్ విక్రయించనున్నట్టు వివరించారు. ఆన్‌లైన్‌లో 4 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు బీఆర్‌కే భవన్‌లో ఉన్నతాధికారులను అజారుద్దీన్ కలిశారు. కాగా ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39,112 కాగా కంప్లమెంటరి టికెట్స్ 9,695, అమ్మకానికి 29,417టికెట్లు అందుబాటులో ఉంటాయి. కాగా భారత్, న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది.
Updated Date - 2023-01-11T20:14:13+05:30 IST