Tilak Varma: ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటిన తెలుగోడు.. శుభ్‌మన్ గిల్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంకు
ABN, First Publish Date - 2023-08-09T21:52:03+05:30
వెస్టిండీస్‌పై గడ్డపై టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. తొలి 3 టీ20ల్లో వరుసగా 39, 51, 49 పరుగులతో రాణించిన తిలక్ వర్మ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోకి అడుగుపెట్టాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 46వ స్థానానికి చేరుకున్నాడు.
వెస్టిండీస్‌పై గడ్డపై టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. తొలి 3 టీ20ల్లో వరుసగా 39, 51, 49 పరుగులతో రాణించిన తిలక్ వర్మ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోకి అడుగుపెట్టాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 46వ స్థానానికి చేరుకున్నాడు. ఇక మూడో టీ20ల్లో 3 వికెట్లతో చెలరేగిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 36 స్థానాలు ఎగబాకి 51వ స్థానానికి చేరుకున్నాడు. కాగా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. అటు వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మనవాళ్లు సత్తా చాటారు. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ తమ కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించారు. బ్యాటింగ్ విభాగంలో గిల్ రెండు స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 743 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. వెస్టిండీస్‌తో ఆడిన వన్డే సిరీస్‌లో 3 హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్ 9 స్థానాలు ఎగబాకి 36వ స్థానానికి చేరుకున్నాడు. కాగా ఈ జాబితాలో పాక్ ఆటగాడు బాబర్ అజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 9వ స్థానంలో, రోహిత్ శర్మ 11వ స్థానంలో ఉన్నారు.
మరోవైపు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. బ్యాటర్ల విభాగంలో 10 స్థానాలు మెరుగుపరచుకుని 71వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో ఐదు స్థానాలు మెరుగుపరచుకుని 11వ స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో 7 వికెట్లు పడగొట్టిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 స్థానాలు ఎగబాకి టాప్ 10లోకి ప్రవేశించాడు. 622 రేటింగ్ పాయింట్లతో 10వ ర్యాంకులో ఉన్నాడు. అలాగే ఈ సిరీస్‌లో 8 వికెట్లు పడగొట్టిన లార్డ్ శార్దూల్ ఠాకూర్ మూడు స్థానాలు ఎగబాకి 30వ ర్యాంకుకు చేరుకున్నాడు.
Updated Date - 2023-08-09T21:52:03+05:30 IST