ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Happy Birthday Mohammad Azharuddin: అజారుద్దీన్‌ను వెంటాడిన రికార్డులు, వివాదాలు

ABN, First Publish Date - 2023-02-08T10:27:46+05:30

హైదరాబాదీ క్రీడాకారుడైన అజారుద్దీన్ ను రికార్డులతోపాటు వివాదాలు వెంటాడాయి....

Happy Birthday Mohammad Azharuddin
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ముహమ్మద్ అజారుద్దీన్ 60వ జన్మదిన వేడుకలు బుధవారం సాగుతున్నాయి.(Mohammed Azharuddin) మాజీ కెప్టెన్(Former Captain) అజారుద్దీన్ 99 టెస్టు మ్యాచ్‌లలో 6,215 రన్స్ చేసి రికార్డు నెలకొల్పారు. హైదరాబాదీ క్రీడాకారుడైన అజారుద్దీన్ ను రికార్డులతోపాటు వివాదాలు వెంటాడాయి.(Happy Birthday Mohammad Azharuddin) మొదటి మూడు టెస్టుల్లోనే సెంచరీలు స్కోర్ చేసిన ఘనతను అజార్ సాధించారు.అత్యధిక వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లలో విజయాలు సాధించిన అజార్ రిక్డార్డులు నెలకొల్పారు.(TOP Records)

భారత క్రికెట్ కెప్టెన్ గా 174 మ్యాచ్‌లలో 90 ఓడీఐ విజయాలను భారత్‌కు అందించారు.అజారుద్దీన్ మూడు ప్రపంచ కప్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహించారు. 1992, 1996, 1999 సంవత్సరాల్లో జరిగిన ప్రపంచ కప్‌లలో భారత జట్టుకు అజార్ నాయకత్వం వహించాడు.మ్యాచ్ ఫిక్సింగ్ ఫిర్యాదులతో అజారుద్దీన్ ను క్రికెట్ ఆటపై నిషేధం విధించారు.(Controversies)

ఇది కూడా చదవండి : Aaftab Poonawala: శ్రద్ధావాకర్‌ను హత్య చేసిన 5 రోజులకే మరో గాళ్‌ఫ్రెండ్‌తో రాత్రిళ్లు గడిపాడు...

దక్షిణాఫ్రికా కెప్టెన్ హన్సీ క్రోంజేని బుకీలకు పరిచయం చేశాడని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో పాల్గొన్నందుకు మహ్మద్ అజారుద్దీన్‌ను బీసీసీఐ, ఐసీసీ నిషేధించాయి.2009వ సంవత్సరంలో అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరి అదే సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొరాదాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.

ఇది కూడా చదవండి : Sania Mirza: విడాకుల పుకార్లకు ఆజ్యం పోస్తూ సానియామీర్జా ఇన్‌స్టాగ్రాంలో తాజా పోస్ట్

అజారుద్దీన్ హైదరాబాదీ అయిన మొదటి భార్యకు విడాకులిచ్చి బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీని వివాహం చేసుకున్నాడు. ఇది అతని రెండవ వివాహం. అతని రెండవ వివాహం కూడా విడాకులతో ముగిసింది. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ కోసం టికెట్లను బ్లాక్ లో విక్రయించారని ఆరోపణలు వచ్చాయి.

Updated Date - 2023-02-08T10:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising