ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ‘లుంగీ డ్యాన్స్’ పాటకు విరాట్ కోహ్లీ డ్యాన్స్ అదిరిపోయింది! మీరు ఓ లుక్కేయండి..

ABN, First Publish Date - 2023-09-13T18:16:00+05:30

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉత్సాహంగా కనబడుతూ ఆటకు 100 శాతం న్యాయం చేస్తాడు.

కొలంబో: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉత్సాహంగా కనబడుతూ ఆటకు 100 శాతం న్యాయం చేస్తాడు. తాను ఉత్సాహంగా ఉండడమే కాకుండా తోటి ఆటగాళ్లను సైతం ఉత్సాహంగా ఉంచుతాడు. అంతేకాకుండా మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులను కూడా ఉత్తేజపరుస్తుంటాడు. ఈ క్రమంలో మైదానంలో కోహ్లీ కొన్ని చిలిపి పనులు కూడా చేస్తుంటాడు. తాజాగా అలాంటిదే కోహ్లీ మరొటి చేశాడు. బాలీవుడ్ ఫేమస్ సాంగ్ లుంగీ డ్యాన్స్‌కు మైదానంలో స్పెప్పులేశాడు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా మంగళవారం భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా టీమిండియా ఫీల్డింగ్ సమయంలో కోహ్లీ ఇలా చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసి అభిమానులు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కాగా మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో విరాట్ కోహ్లీ ఇలా స్టెప్పులేయడం ఇది కొత్తేం కాదు. గతంలోనూ పలుమార్లు ఇలానే చేశాడు. ముఖ్యంగా పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ స్టెప్పులను మైదానంలో చేశాడు. అలాగే సినిమాలోని తగ్గేదెలే డైలాగ్‌కు సంబంధించిన మేనరిజాన్ని కూడా మైదానంలో ప్రదర్శించాడు. ఈ వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేశాయి.


ఇక ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో భారత్‌ వరుసగా రెండో గెలుపు నమోదుచేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే నాలుగు పాయింట్లతో తుది పోరుకు అర్హత సాధించింది. సూపర్‌-4లో భారత్‌ తన చివరి మ్యాచ్‌ను శుక్రవారం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. లంకతో పోరులో కెప్టెన్‌ రోహిత్‌ (48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53) హ్యాట్రిక్‌ అర్ధసెంచరీ సాధించగా.. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (4/43) మరోసారి దెబ్బతీశాడు. ముందుగా భారత్‌ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ (39), ఇషాన్‌ (33), అక్షర్‌ (26) ఫర్వాలేదనిపించారు. దునిత్‌ వెల్లలగెకు 5, అసలంకకు 4 వికెట్లు దక్కాయి. ఛేదనలో శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. వెల్లలగె (42 నాటౌట్‌), ధనంజయ డిసిల్వా (41) రాణించారు. ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న లంక స్టార్‌ వెల్లలగె మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Updated Date - 2023-09-13T18:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising