Infinite Love: భార్య అనుష్కశర్మపై విరాట్ కోహ్లీ ప్రేమతో కొత్త ఫొటో పోస్ట్ చేశారు...

ABN, First Publish Date - 2023-05-05T12:33:03+05:30

ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కొత్త చిత్రంతో భార్య అనుష్క శర్మపై తన అమితమైన ప్రేమను వ్యక్తం చేశారు....

Infinite Love: భార్య అనుష్కశర్మపై విరాట్ కోహ్లీ ప్రేమతో కొత్త ఫొటో పోస్ట్ చేశారు...
Virat Kohli Expresses Love For Anushka
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి: ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కొత్త చిత్రంతో భార్య అనుష్క శర్మపై తన అమితమైన ప్రేమను వ్యక్తం చేశారు.(Virat Kohli) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2023 పోరుకు ముందు విరాట్ కోహ్లి శుక్రవారం తన భార్య అనుష్క శర్మతో(Wife Anushka Sharma) కలిసిన అందమైన కొత్త చిత్రాన్ని(New Picture) సోషల్ మీడియాలో పంచుకున్నారు.కోహ్లి చాలా కాలం పాటు టీం ఇండియాకు నాయకత్వం వహించిన ప్రఖ్యాత క్రికెటర్ అయితే, అనుష్కశర్మ దేశంలో ప్రముఖ బాలీవుడ్ నటిమణి. సెలబ్రిటీ జంట అయిన అనుష్కశర్మ, కోహ్లీ పెట్టే సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : Pakistan minister: పాక్ మంత్రి బిలావల్ భుట్టోకి మన కేంద్రమంత్రి జయశంకర్ స్వాగతం ఎలా చెప్పారంటే...

కోహ్లీ జంట పోస్టు చేసిన తాజా చిత్రంపై అభిమానులు రీట్వీట్లు, కోట్స్, లైక్ లతో హోరెత్తించారు.కోహ్లీ, అనుష్క దంపతుల ఫొటో పోస్టుకు 5,675 రీట్వీట్లు,74.8 కే లైక్‌లు వచ్చాయి.కోహ్లీ, అనుష్కలది అనంతమైన ప్రేమ(Expresses His Infinite Love) అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తదుపరి ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉన్నారు.దీంతో కోహ్లీ, అనుష్క శర్మలు ఇటీవల రాజధానిలో తిరుగుతూ కనిపించారు.వారి తాజా చిత్రం కూడా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ నుంచి తీసినట్లుగా తెలుస్తోంది.

Updated Date - 2023-05-05T13:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising