Virat Kohli: ఆర్సీబీని వదిలి ఇతర ఫ్రాంచైజీలో చేరడం గురించి ఆలోచించాను.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్
ABN, First Publish Date - 2023-11-27T12:00:48+05:30
IPL 2024: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మొదటి సీజన్ నుంచి ఆడుతున్నాడు. మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు 16 ఏళ్లపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకే కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో బ్యాటర్‌గా అనేక రికార్డులందుకున్న విరాట్ కోహ్లీ ట్రోఫీని మాత్రం గెలవలేకపోయాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మొదటి సీజన్ నుంచి ఆడుతున్నాడు. మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు 16 ఏళ్లపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకే కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో బ్యాటర్‌గా అనేక రికార్డులందుకున్న విరాట్ కోహ్లీ ట్రోఫీని మాత్రం గెలవలేకపోయాడు. ఆటగాడిగా జట్టుకు ట్రోఫీ అందించడానికి కోహ్లీ 100 శాతం కృషి చేస్తున్నప్పటికీ కప్ మాత్రం గెలవలేకపోతున్నాడు. దీంతో తన కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. టోర్నీలో చాలా సీజన్లలో అన్ని విధాల బలంగా కనిపించిన ఆర్సీబీ పలు మార్లు ఫైనల్ కూడా చేరింది. కానీ తుది పోరులో బోల్తాపడింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగా మారిపోయింది.
ఈ క్రమంలో ఒకానొక దశలో ఆర్సీబీ ఫ్రాంచైజీని విడిచిపెట్టాలని భావించానని విరాట్ కోహ్లీ ఆశ్చర్యర వ్యాఖ్యలు చేశాడు. ఇందుకోసం 2022 వేలంలో తనను ఉంచడానికి ఇతర ఫ్రాంచైజీలు ఎలా సంప్రదించాయో వెల్లడించాడు. కానీ తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి విధేయుడిగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో కింగ్ కోహ్లీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే నేను ఇతర ఫ్రాంచైజీలో చేరడం గురించి ఆలోచించాడు. దాని గురించి చెప్పడానికి నేను సిగ్గుపడడం లేదు. నేను ఎలాగైనా వేలంలోకి రావాలని, నా పేరును అక్కడ ఉంచాలని, నన్ను చాలాసార్లు సంప్రదించారు. దీంతో ఆ తర్వాత నేను దాని గురించి(వేలంలోకి రావడం) ఆలోచించాను. రోజు చివరలో ప్రతి ఒక్కరికి వారు జీవించే ఎక్స్ సంఖ్యలు ఉన్నాయి. మీరు చనిపోతారు. జీవితం ముందుకు సాగుతుంది. ట్రోఫీలు గెలుచుకున్న గొప్ప వ్యక్తులు చాలా మంది ఉండే ఉంటారు. కానీ ఎవరూ మిమ్మల్ని అలా సంబోధించరు. గదిలో మిమ్మల్ని ఎవరూ ఓహ్ అతను IPL ఛాంపియన్ లేదా అతను ప్రపంచ కప్ ఛాంపియన్ అని సంబోధించరు. మీరు మంచి వ్యక్తి అయితే ప్రజలు మిమ్మల్ని ఇష్టపడతారు. మీరు చెడ్డ వ్యక్తి అయితే వారు మీ నుంచి దూరంగా ఉంటారు. చివరికి అదే జీవితం” అని కోహ్లి ఆర్సీబీ వద్ద ఉండాలనే తన నిర్ణయం వెనుక ఉన్న ఆలోచనను వివరించాడు.
ఇతర ఫ్రాంచైజీలు ఏవి కూడా తనకు మద్దతుగా నిలవనప్పుడు ఆర్సీబీ తనపై ఉంచిన విశ్వాసం పట్ల తన విధేయత, అతను ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకునే అవకాశం ఉన్నమరొక జట్టులో చేరడం కంటే చాలా ముఖ్యమైనదని కింగ్ కోహ్లీ చెప్పాడు. "మొదటి మూడు సంవత్సరాలలో అవకాశాల పరంగా ఈ ఫ్రాంచైజీ నాకు చాలా ఇచ్చింది. నాపై నమ్మకం ఉంచింది. ఇది చాలా ప్రత్యేకమైన విషయం. ఎందుకంటే నేను చెప్పినట్లుగా చాలా జట్ల నుంచి నాకు అవకాశం వచ్చింది. కానీ వారు నాకు మద్దతు ఇవ్వలేదు. వారు నన్ను నమ్మలేదు. పెద్ద నిర్ణయాలు తీసుకునే విషయంలో నా భార్య అనుష్క శర్మ అభిప్రాయం మాత్రమే నాకు ముఖ్యం.’’ అని కోహ్లీ వెల్లడించాడు.
Updated Date - 2023-11-27T14:08:03+05:30 IST