ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup 2023: ప్రపంచకప్ ప్రారంభమైందోచ్!.. టాస్ గెలిచిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్

ABN, First Publish Date - 2023-10-05T13:47:43+05:30

క్రికెట్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో గత ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే.

అహ్మదాబాద్: క్రికెట్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో గత ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం అతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఆడడం లేదు. దీంతో అతని స్థానంలో టామ్ లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అటు ఇంగ్లండ్‌లో కూడా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ ఆడడం లేదు.


తుది జట్లు

ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్/వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్

Updated Date - 2023-10-05T13:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising