ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World cup: టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు.. నిన్న గిల్.. నేడు హార్దిక్

ABN, First Publish Date - 2023-10-07T13:22:55+05:30

వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం నుంచి టీమిండియా ప్రయాణం మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.

చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం నుంచి టీమిండియా ప్రయాణం మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ జ్వరం బారిన పడ్డాడు. తాజాగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్‌లో సిరాజ్ వేసిన ఓ బంతిని ఎదుర్కొనే క్రమంలో పాండ్యా వేలికి గాయమైనట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే గాయం అంత పెద్దది కాదని తెలుస్తోంది. దీంతో అతను ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడడానికి ఎలాంటి ఇబ్బంది లేదని అర్థమవుతోంది. దీనిపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఇక డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న గిల్ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగేది లేనిది అనుమానంగానే ఉంది. ఈ విషయంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే గిల్ డెంగ్యూ బారిన పడినట్టు బీసీసీఐ ఇప్పటివరకు ప్రకటించలేదు. కాకపోతే అతను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపింది. సాధారణంగా డెంగ్యూ సోకితే కోలుకోవడానికి 10 రోజుల సమయం పడుతుంది. అదే జరిగితే తర్వాతి రెండు మ్యాచ్‌లకు కూడా గిల్ అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో గిల్ ఆడడం అనుమానమే. గిల్ కనుక జట్టుకు దూరమైతే అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.


టీమిండియా స్క్వాడ్

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

Updated Date - 2023-10-07T13:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising