భవనం పైనుంచి పడి ఉపాధ్యాయుడి మృతి
ABN , First Publish Date - 2023-02-12T01:30:27+05:30 IST
అనుమానాస్పదస్థితి లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ నివారం జరిగింది.

భవనం పైనుంచి పడి ఉపాధ్యాయుడి మృతి
మృతిపై అనుమానం వ్యక్తం చేసిన భార్య, మిర్యాలగూడలో ఘటన
మిర్యాలగూడఅర్బన, ఫిబ్రవరి 11: అనుమానాస్పదస్థితి లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ నివారం జరిగింది. వనటౌన పోలీసులు, కుటుంబ సభ్యుల వి వరాల ప్రకారం.. అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత జాంజునాయక్ (42) మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. జాంజునాయ క్ భార్యతో కలిసి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఓ ఇంటి మొదటి అంతస్థులో అద్దెకు ఉంటున్నారు. ఉపాధ్యాయుడి భార్య బుజ్జి పని నిమిత్తం శుక్రవా రం హైదరాబాద్‌కు వెళ్లింది. ఉపాధ్యాయుడు జాంజునాయక్ పాఠశాల విధులు ము గించుకొని శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. రాత్రివేళలో తనకు ఫోన రావడంతో మాట్లాడుకుంటూ ఇంటి పైఅంతస్థు రక్షణగోడ వద్దకు చేరుకొని పట్టు తప్పి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్క డే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయుడికి కుమారుడు, కుమార్తె ఉ న్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటగిరి సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. తన భర్త మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ బుజ్జి పోలీసుల కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని డీఎస్పీ పర్యవేక్షణలో దర్యా ప్తు చేస్తున్నట్లు వనటౌన సీఐ రాఘవేందర్ తెలిపారు.