విద్యుత్‌ వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2023-05-03T22:23:27+05:30 IST

వాంకిడి, మే 3: విద్యుత్‌వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్‌ శాఖ ఏడీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం మండలకేంద్రంలోని విద్యుత్‌సెక్షన్‌ కార్యాలయంలో విద్యుత్‌భద్రత వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.

విద్యుత్‌ వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి

వాంకిడి, మే 3: విద్యుత్‌వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్‌ శాఖ ఏడీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం మండలకేంద్రంలోని విద్యుత్‌సెక్షన్‌ కార్యాలయంలో విద్యుత్‌భద్రత వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు విద్యుత్‌నుఆదా చేయడం తోపాటు ప్రమాదాలు జరుగకుండా తగినజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతు లకు ఎలాంటి సమస్యలు వచ్చిన విద్యుత్‌ అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్‌, సబ్‌ఇంజనీర్‌ సౌమ్యశ్రీ, ఎస్‌ఎల్‌ఐ శ్రీనివాస్‌రావు, జేఎల్‌ఎం వెంకటేష్‌, సతీష్‌, సంతోష్‌, శ్రీనివాస్‌, శ్యామ్‌, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: విద్యుత్‌ భద్రత వారోత్సవాల పోస్టర్లను డివిజన్‌ ఇంజనీర్‌ రాజశేఖర్‌ బుఽధవారం స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 వరకు భద్రతా వారోత్సలు జరుగుతాయన్నారు. రైతులు తప్పకుండా విద్యుత్‌ సిబ్బంది సూచించిన సలహాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌, ఏఈలు జగన్‌మోహన్‌, రవీందర్‌, కమలాకర్‌, సబ్‌ఇంజనీర్లు శ్రీనివాస్‌, అఖిల్‌, శరత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-05-03T22:23:27+05:30 IST