Kumaram Bheem Asifabad: అసెంబ్లీ సమావేశాల్లో వంతెనలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ABN , First Publish Date - 2023-08-04T22:52:53+05:30 IST
ఆసిఫాబాద్ రూరల్, ఆగస్టు 4: నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతా ల్లో ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లు, వంతెనల స్థితిగతులపై శుక్రవారం ఎమ్మెల్యే ఆత్రం సక్కు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిం చారు. హైలెవల్ బ్రిడ్జిలు లేని కారణంగా ఇటీవల ముగ్గురువ్య క్తులు వాగులో కొట్టుకు పోవడం చాలా బాధకరమని విచారం వ్యక్తం చేశారు.

ఆసిఫాబాద్ రూరల్, ఆగస్టు 4: నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతా ల్లో ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లు, వంతెనల స్థితిగతులపై శుక్రవారం ఎమ్మెల్యే ఆత్రం సక్కు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిం చారు. హైలెవల్ బ్రిడ్జిలు లేని కారణంగా ఇటీవల ముగ్గురువ్య క్తులు వాగులో కొట్టుకు పోవడం చాలా బాధకరమని విచారం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలోని తుంపల్లి, కరంజివాడ, జన్కాపూర్, వాడిలొద్ది, లోకారి, నంబాల, కనర్‌గాం, బారిక్‌రావు గూడ, గుమ్నూర్, పిట్టగూడ, కొద్దిగూడ, బుగ్గుగూడ, అప్పపల్లి, గోండ్ కాసార, లెండిగూడ, రాంపూర్ తదితరగ్రామాల వాగులపై హైలెవల్‌వంతెనలు మంజూ రు చేయాలన్నారు. అదేవిధంగా నిర్మాణదశలో ఉన్న గుండి, అనార్‌పల్లి, కిషన నాయక్‌తండా, అమీన్‌గూడ, పవన్‌మడుగు వంతెనలు పూర్తిచేయాలని కోరారు. దీంతో ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.