ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghunandan Rao: గూండా గిరి మాకు రాదు.. ఎవరి జాగా భూములు కబ్జా చేయలే

ABN, First Publish Date - 2023-11-15T12:31:33+05:30

Telangana Elections: దుబ్బాక మండలం రామక్కపేట, పెద్ద చీకోడు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

సిద్దిపేట: దుబ్బాక మండలం రామక్కపేట, పెద్ద చీకోడు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెద్ద చీకోడ్‌లో ఒక్కరికన్న దళిత బంధు, బీసీ బంధు రాలేదు ఎందుకు అని ప్రశ్నించారు. చీకోడులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నచ్చిన వాళ్లకు ఇచ్చుకున్నారని ఆరోపించారు. ‘‘గూండా గిరి మాకు రాదు.. ఎవరి జాగ భూములు కబ్జా చేయలేను’’ అని స్పష్టం చేశారు. మంచికి మారుపేరు బీజేపీ పార్టీ, నాయకులన్నారు. పదహారు నెలల నుంచి గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో రూ.50 లక్షల స్వంత ఖర్చులతో అంబులెన్స్ అందజేసినట్లు తెలిపారు. కుల సంఘాలను బీఆర్ఎస్ నాయకులు భయపట్టిస్తున్నారన్నారు. కోపన్ కార్డులు ఇవ్వాలని అసెంబ్లీలో కొట్లాడితే కోటర్ సీసాలు ఇస్తుండ్రని విమర్శించారు. చీకోడ్‌ను దత్తత తీసుకొని మంత్రి హరీశ్ రావు ఒక్క రోజు గ్రామానికి రాలే అని అన్నారు. భర్త చనిపోయిన మహిళ, 57 ఏండ్ల వారికి ఫెన్షన్ లేదన్నారు. మంత్రి హరీష్ రావు చాలా గొప్ప కళాకారుడని.. ఏ ఊరుకు పోయినా ఆ ఊరుకే నిధులు అని చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలు, మోసగాళ్ల మాటలు నమ్మవద్దని సూచిస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-11-15T12:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising