ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay: కోనప్పా... ఇగ చాలప్పా... ఆంధ్రా వెళ్లిపో..

ABN, First Publish Date - 2023-11-10T16:40:38+05:30

Telangana Elections: ఉద్యోగ, ఉపాధ్యాయులారా... సర్కార్లను మార్చేసిన చరిత్ర మీది అని... కేసీఆర్ అరాచక పాలనకు పాతరేయండి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిచ్చారు.

కొమురంభీం: ఉద్యోగ, ఉపాధ్యాయులారా... సర్కార్లను మార్చేసిన చరిత్ర మీది అని... కేసీఆర్ (CM KCR) అరాచక పాలనకు పాతరేయండి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (BJP National General Secretary Bandi Sanjay) పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్ కాగజ్‌నగర్ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వస్తే వెంటనే కుప్పకూలుతాయన్నారు. తెలంగాణలో బీజేపీ తొలి గెలుపు సిర్పూర్ దే అని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కోనప్పా... ఇగ చాలప్పా... ఆంధ్రా వెళ్లిపో...’’ అంటూ బీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కన్నప్పపై బీజేపీ నేత వ్యాఖ్యలు చేశారు.


అంబలి, అన్నదానం చేస్తే చేసిన పాపాలు పోతాయా? అని ప్రశ్నించారు. సిర్పూర్ మిల్లులో ఉద్యోగాలియ్యకుండా స్థానికుల పొట్టకొడతావా అంటూ మండిపడ్డారు. చేసిన తప్పులకు రాజీనామా చేసి వెళ్లిపోక మళ్లీ ఓట్లడుగుతావా అని నిలదీశారు. 50 లక్షల నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. ఉద్యోగాల్లేక ఇంటికి బరువైన యువతను చూసి తల్లిదండ్రులు గుండెపగిలి రోదిస్తున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థుల, మహిళల పక్షాన యుద్ధం చేశానన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్‌లో గోండు ఖిల్లాను కబ్జా చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఎంఐఎం నేతలు రెచ్చిపోతుంటే ఏం చేస్తున్నారని అడిగారు. ‘‘పాతబస్తీలో సభ పెట్టి దమ్ము చూపిన... సిర్పూర్‌లో మీ సత్తా చాటండి’’ అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.

Updated Date - 2023-11-10T16:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising