TS POLLS: నగదు పంచుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ బీజేపీ నేత
ABN, First Publish Date - 2023-11-26T21:43:25+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం నడుస్తోంది. ఓటర్లను ఎన్నికల్లో ఆకట్టుకోడానికి వివిధ పార్టీల అభ్యర్థులు పలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకోడానికి ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధపడుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం నడుస్తోంది. ఓటర్లను ఎన్నికల్లో ఆకట్టుకోడానికి వివిధ పార్టీల అభ్యర్థులు పలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకోడానికి ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ప్లాన్‌లో భాగంగా బీజేపీ పార్టీకి చెందిన ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ( Chintala Ramachandra Reddy ) ఓటర్లకు నగదును భారీగా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం రావడంతో పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బీజేపీ అధికార ప్రతినిధి అమర్‌నాథ్ ( Amarnath ) ను రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. అమర్‌నాథ్‌ను నారాయణగూడ పీఎస్‌కు పోలీసులు తరలించారు.
Updated Date - 2023-11-26T21:43:30+05:30 IST