Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ మరో శ్రీలంక అవుతుంది
ABN, First Publish Date - 2023-11-16T15:43:24+05:30
బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే. ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
సంగారెడ్డి: సమర్థ పాలన కేవలం బీజేపీతోనే (BJP) సాధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అభిప్రాయపడ్డారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం సండే మార్కెట్‌లో బీజేపీ బహిరంగ సభకు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రజలనుద్దేశించి ప్రసగించారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే. ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కేసీఆర్ (CM Kcr), కాంగ్రెస్ పార్టీలు (Congress) కూర్చుని ఆరు గ్యారంటీ పథకాలు సృష్టించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ మరో శ్రీలంక అవుతుంది.’’ అని విమర్శించారు.
‘‘పటాన్‌చెరు బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి పైసలిచ్చి టికెట్ తెచ్చుకున్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలు విస్తరణకు కృషి చేస్తాం. ప్రధాని మోదీ (pm modi) ఇచ్చే పైసలతో డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఆసుపత్రులు కట్టారు. పోడు భూముల కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడితే మాపై కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికోసమైనా కొట్లాడి జైలుకు పోయారా?, బీసీ ముఖ్యమంత్రి డిక్లరేషన్ చేసి బీజేపీ సంచలనం సృష్టించింది. హిందుత్వాన్ని కాపాడుకోవాలి, హిందు ధర్మం కాపాడుకోకపోతే పెను ప్రమాదం తప్పదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రజాకార్ల పాలన కొనసాగుతోంది. కేసీఆర్ నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి.’’ అని ప్రజలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Updated Date - 2023-11-16T15:44:27+05:30 IST