ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Laxman: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల తర్వాత కలుస్తాయ్

ABN, First Publish Date - 2023-11-17T14:31:52+05:30

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తోడు దొంగలని.. ఎంఐఎం కబంధ హస్తాల్లో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్‌లు(Congress) తోడు దొంగలని.. ఎంఐఎం (MIM) కబంధ హస్తాల్లో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. శుక్రవారం మీట్ ది ప్రెస్‌లో ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల తర్వాత కలుస్తాయన్నారు. బీజేపీ బీసీని సీఎం చేస్తామంటే.. బీసీలను అవమానించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ బాధ్యత తాను తీసుకుంటానని ప్రధాని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని .. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ల అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇచ్చారు. కులం కాదు గుణం ముఖ్యమని కేటీఆర్ కూడా బీసీలను అవమానించే విధంగా మాట్లాడారన్నారు. బీసీ జనగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని.. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని... టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయని తెలిపారు. రెడ్డి, చౌదరీలు కర్ణాటకలో బీసీలు... వైశ్యులు, బ్రాహ్మణులు కొన్ని రాష్ట్రాల్లో బీసీలు... వాళ్ళను బీసీలో చేర్చాలా? అని ప్రశ్నించారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి ఉమ్మడి పౌర చట్టాన్ని తీసుకొచ్చేందుకు వర్క్ అవుట్ చేస్తామని ఎంపీ తెలిపారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



బీసీల నుంచి సీఎం అభ్యర్థులు తమ పార్టీలో చాలా మంది ఉన్నారన్నారరు. బీజేపీ, ఆర్‌ఎస్ మధ్య ఎలాంటి గ్యాబ్ లేదన్నారు. ఆర్ఎస్ఎస్ సలహాలు సూచనలు మాత్రమే ఇస్తుందని తెలిపారు. తాండూరులో తమ మిత్రపక్షం జనసేన పోటీ చేస్తుందన్నారు. మిత్ర పక్షంలో ఉన్న వారిని బీజేపీ గౌరవిస్తుందన్నారు. సంస్థాగత మార్పులలో భాగంగానే బండి సంజయ్‌ను మార్చడం జరిగిందని.. ఇప్పుడు ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పారు. చిదంబరం వ్యాఖ్యలు హత్య చేసిన వాడే నివాళులు అర్పించినట్టు ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వచ్చి క్షమాపణ చెబితే తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. గ్యారంటీలు ఓట్ల కోసం వేసే గాలం మాత్రమే అని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించామని.. ఇక్కడ కూడా అధికారం ఇస్తే తగ్గిస్తామని ఎంపీ లక్ష్మణ్ హామీ ఇచ్చారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-17T14:31:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising