Share News

Telangana Results: తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్‌కు బ్రేక్..

ABN , First Publish Date - 2023-12-03T12:27:16+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా స్పీకర్‌గా పని చేసిన వారు ఇప్పటి వరకూ గెలిచిన పాపాన పోలేదు. తొలిసారిగా ఆ చరిత్రను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తిరగరాయబోతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి దూసుకుపోతున్నారు.

Telangana Results: తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్‌కు బ్రేక్..

నిజమాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా స్పీకర్‌గా పని చేసిన వారు ఇప్పటి వరకూ గెలిచిన పాపాన పోలేదు. తొలిసారిగా ఆ చరిత్రను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తిరగరాయబోతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రను పోచారం తిరగ రాశారు. 13 రౌండ్లలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి 1107 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి నిన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను పరీక్షిస్తే ఒకసారి స్పీకర్‌గా పని చేసిన నాయకులు తదుపరి ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన దాఖలాలే లేవు. గత తెలంగాణ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి పోటీ చేసిన అప్పటి స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకటరమణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా 2014 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు.

అసలు 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలిచింది లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాక.. అప్పటి ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ సెంటిమెంటుకు భయపడే గత స్పీకర్ మధుసూధనాచారి తన నియోజకవర్గంలో నిత్యం క్యాడర్‌తో ఉంటూ విపరీతంగా పర్యటించినా కూడా ఫలితం దక్కలేదు. మొత్తానికి పోచారం అయితే హిస్టరీని తిరగరాయబోతున్నారు.

Updated Date - 2023-12-04T10:15:08+05:30 IST