ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR : కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పడంలో మొనగాళ్లు

ABN, First Publish Date - 2023-11-16T19:01:49+05:30

కాంగ్రెస్ నేతలు ( Congress Leaders ) అబద్ధాలు చెప్పడంలో మొనగాళ్లు అని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. గురువారం నాడు నర్సాపూర్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం ఆగం కావద్దు. వచ్చే ఐదేళ్ల కోసం మీ తలరాతని ఓటే మారుస్తుంది. పార్టీలు, నాయకుల గురించి చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు.

మెదక్ జిల్లా: కాంగ్రెస్ నేతలు ( Congress Leaders ) అబద్ధాలు చెప్పడంలో మొనగాళ్లు అని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. గురువారం నాడు నర్సాపూర్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడుతూ..‘‘ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం ఆగం కావద్దు. వచ్చే ఐదేళ్ల కోసం మీ తలరాతని ఓటే మారుస్తుంది. పార్టీలు, నాయకుల గురించి చర్చ జరగాలి. బీఆర్ఎస్ ( BRS ) పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణని ఊడగొట్టిన పార్టీ. బీఆర్ఎస్ ( BRS ) పార్టీ పదేళ్ల కింద అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ల పాలన ఎలా ఉందో మీకు తెలుసు.తెలంగాణలో రైతుల గురించి అద్భుతంగా పని చేశాము. రైతు బంధు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు సహాయం చేయలేదు. రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వమే కొంటుంది. ప్రజలు కట్టే పన్నుల డబ్బులని కేసీఆర్ వృథా చేసి రైతు బంధు ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతు బంధు వృథానా..? రైతు బంధు ఉండాలి..అది 16 వేలు కావాలి అంటే బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఈ ఎన్నికల్లో గెలవాలి. 24 గంటల కరెంట్ వెస్ట్ అని రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ఎవ్వరిని అడిగినా 24 గంటల కరెంట్ కావాలని అంటున్నారు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

ధరణిని తీసేస్తే పైరవీలు మళ్లీ పెరుగుతాయి

‘‘రేవంత్‌రెడ్డి మాత్రం 3 గంటల కరెంట్ చాలని అంటున్నారు. ఇంకా 10HP మోటార్ పెట్టుకోవాలి అంటున్నారు. ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ధరణిని తీసివేస్తాం అంటున్నారు. ధరణి ఉంది కాబట్టే రైతు బంధు వస్తుంది. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తే రైతు బంధు ఎలా వస్తుంది. ధరణి పోతే మళ్లీ పాత కాలం వస్తుంది. ధరణి తీసేస్తే భూముల కబ్జాలు, పైరవీలు మళ్లీ పెరుగుతాయి. మూడేళ్లు కష్టపడి ధరణి తెచ్చాము. భూముల ధరలు పెరిగాయి..ధరణి లేకుంటే ఎన్నో గొడవలు జరిగేవి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఒరేయ్ సన్నాసి మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కులాలు, మతాలు అనే ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నాం. సునీతా లక్ష్మా రెడ్డిని అభ్యర్థిగా పెడుదాం అన్నప్పుడు మదన్‌రెడ్డి సహకరించారు. మదన్ రెడ్డి నా చిరకాల మిత్రుడు ఆయనకి సముచిత స్థానం కల్పిస్తాం. బీఆర్ఎస్ ( BRS ) సెక్యులర్ పార్టీ. అన్ని మతాలను, సంప్రదాయాలను బీఆర్ఎస్ ( BRS ) పార్టీ గౌరవిస్తుంది’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన వివిధ పార్టీల నేతలు

సీఎం కేసీఆర్ నర్సాపూర్ ప్రజాఆశీర్వాద సభలో వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పుకున్న వారిలో కాంగ్రెస్ నుంచి.. గాలి అనిల్ కుమార్, మ్యాడం బాలక్రిష్ణ, బీజేపీ నుంచి.. దేశ్ పాండే, శ్రీకాంత్ గౌడ్, సింగయిపల్లి గోపి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్‌ను గాలి అనిల్ ఆశించారు. నర్సాపూర్ బీజేపీ టికెట్‌ను సింగయిపల్లి గోపి ఆశించారు. సంగారెడ్డి బీజేపీ టికెట్‌ను దేశ్ పాండే ఆశించారు, మెదక్ కాంగ్రెస్ మ్యాడం బాలక్రిష్ణ ఆశించారు. ఈ ముగ్గురికి టికెట్ రాకపోవడంతో ఆయా పార్టీలపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు నేతలు రాజీనామా చేశారు. నర్సాపూర్ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఈ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Updated Date - 2023-11-16T20:55:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising