ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Etala Rajender: కేసీఆర్‌పై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శలు

ABN, First Publish Date - 2023-11-30T21:23:44+05:30

గజ్వేల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, జీతాలు పెన్షన్లు ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిందే అని విమర్శించారు.

సిద్దిపేట: గజ్వేల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, జీతాలు, పెన్షన్లు ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిందే అని విమర్శించారు.

"బీజేపీ మొదటి నుంచి సిద్ధాంతపరమైన పార్టీ. డబ్బు, మద్యం వంటి వాటితో వెలకట్టే పార్టీ కాదు. తెలంగాణలో కేసీఆర్‌పై ఎంతో వ్యతిరేకత ఉంది. నియంతలా, నీరో చక్రవర్తి లాగా దోపిడీ ప్రభుత్వాన్ని నడిపిస్తోన్నారు. తెలంగాణ ప్రజలు, యువత మార్పు కావాలి. బీజేపీ రావాలి. మోడీకి అండగా ఉండాలని నిర్ణయించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. జీతాలు పెన్షన్లు ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిందే. అంతిమతీర్పు ప్రజలదే, ప్రజలే తమ శక్తిని, అభిప్రాయాన్ని ఆవిష్కరించిట్లు కనిపిస్తుంది. యువశక్తి బీజేపీకి పెద్ద ఎత్తున తోడ్పాటు అందించింది. హుజూరాబాద్ ప్రజానీకం మళ్ళీ గొప్ప మెజార్టీతో గెలిపించబోతున్నారు. చాలామంది చాలా కుట్రలు చేశారు. అయినా నువ్వు లేని హుజూరాబాద్ లేదని తీర్పు ఇస్తున్నారు. గజ్వేల్ లో అతితక్కువ కాలంలో గొప్ప ఆదరణ అందించారు. బీజేపీలో ఉన్న కార్యకర్తలకు ఇక్కడి ప్రజలు, పెద్దలు, అనేక మంది నాయకులు వచ్చి గజ్వేల్‌లో పోటీ చేయాలని కోరారు. కేవలం 45 రోజుల క్రితమే వచ్చినా ఇక్కడి ప్రజల ఆదరణ మరవలేనిది. ఇది మా అడ్డ మమ్మల్ని ఓడగిట్టే సత్తా ఎవరికుందని విర్రవీగుతున్నారు. రాజ్యం కర్కశంగా ఉన్నప్పుడు, వారి దుర్మార్గాన్ని, అహంకారాన్ని సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ది చెబుతారు. సర్వేల్లో ఏమిస్తాదో కానీ ఎక్కడకు పోయినా మంచి మెజార్టీతో గెలుస్తున్నట్లు చెబుతున్నారు. హుజూరాబాద్ ప్రజలకు ఒక సైకొనూ, శాడిస్తును ఇచ్చారు. ఇది కేసీఆర్ వైఖరి. మాకు 25 నుంచి 30 సీట్లు వస్తాయి." అని ఈటల రాజేందర్ తెలిపారు.

Updated Date - 2023-11-30T21:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising