ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Revanth Reddy: ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రివ్యూ

ABN, First Publish Date - 2023-12-11T16:24:01+05:30

వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) బిజీబిజీగా ఉన్నారు. సోమవారం నాడు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశించారు.

హైదరాబాద్: వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) బిజీబిజీగా ఉన్నారు. సోమవారం నాడు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రైతు భరోసా పథకంపై కూడా సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సెక్రటేరియట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ( MCHRD) అధికారులతో.. ఏక్సైజ్ శాఖ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయంలో ఉన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఛాంబర్‌కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. పూర్ణ కుంభంతో వేదపండితులు మంత్రి ఉత్తమ్‌కి స్వాగతం పలికారు. అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-12-11T16:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising