ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Revanth Reddy: మల్కాజ్‌గిరి ప్రజలకు సీఎం రేవంత్ బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?

ABN, First Publish Date - 2023-12-08T19:38:23+05:30

మల్కాజ్‌గిరి ( Malkajgiri ) పార్లమెంట్ సభ్యత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Enumula Revant Reddy ) రాజీనామా చేశారు. శుక్రవారం నాడు లోక్‌సభ స్పీకర్ హోమ్ బిర్లా ( Lok Sabha Speaker Home Birla ) ను కలిసి తన రాజీనామా పత్రాన్ని రేవంత్‌రెడ్డి సమర్పించారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

హైదరాబాద్: మల్కాజ్‌గిరి ( Malkajgiri ) పార్లమెంట్ సభ్యత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Enumula Revant Reddy ) రాజీనామా చేశారు. శుక్రవారం నాడు లోక్‌సభ స్పీకర్ హోమ్ బిర్లా ( Lok Sabha Speaker Home Birla ) ను కలిసి తన రాజీనామా పత్రాన్ని రేవంత్‌రెడ్డి సమర్పించారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఏం చెప్పారంటే... ‘‘నా రాజకీయ ప్రస్థానంలో కొడంగల్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో, మల్కాజ్‌గిరికి అంతే ప్రాధాన్యత ఉంది. నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్‌గిరి ప్రజలదే. ఏ విశ్వాసంతో, ఏ అభిమానంతో నన్ను గెలిపించారో ఐదేళ్లు మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశాను. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్ని సార్లు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో నా పరిస్థితిని మీరు సహృదయంతో అర్థం చేసుకున్నారు. తల్లి తన బిడ్డను దేశ రక్షణ కోసం పంపినట్టు, నన్ను మీరు తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారు. ఇన్నాళ్లు ఆ బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించానని భావిస్తున్నాను. మల్కాజ్‌గిరి ప్రజలకు పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు. ఐదేళ్లే కాదు ఇక మీతో నా అనుబంధం.. నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం. మల్కాజ్ గిరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాడు మీరు పోసిన ఊపిరి... నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-12-08T19:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising