ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Priyanka Gandhi: రేవంత్ రెడ్డి పాటకు స్టెప్పులేసిన ప్రియాంక గాంధీ

ABN, First Publish Date - 2023-11-28T14:18:17+05:30

Telangana Elections: జిల్లాలోని జహీరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ షోలో అగ్రనేత ప్రియాంక గాంధీ, పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ రోడ్‌షోకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. జహీరాబాద్‌లో కార్నర్ మీటింగ్‌లో ప్రియాంక ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాటపై ప్రియాంక గాంధీ స్టెప్పులేసి అందరినీ ఉత్సాహపరిచారు. దొరల తెలంగాణ కావాలో... ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రియాంక అన్నారు. దేశంలో ఫామ్ హౌస్‌లో ఉండి పాలించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు.

సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ షోలో అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ (Congress Candidate Chandrashekar) పాల్గొన్నారు. ఈ రోడ్‌షోకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. జహీరాబాద్‌లో కార్నర్ మీటింగ్‌లో ప్రియాంక ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాటకు ప్రియాంక గాంధీ స్టెప్పులేసి అందరినీ ఉత్సాహపరిచారు. దొరల తెలంగాణ కావాలో... ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రియాంక అన్నారు. దేశంలో ఫామ్ హౌస్‌లో ఉండి పాలించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓవైసీ పోటీ చేస్తారని.. తెలంగాణలో అన్నిచోట్ల ఎందుకు పోటీ చేయరని ప్రశ్నించారు.

అక్రమాలతో దేశంలో బీజేపీ (BJP), రాష్ట్రంలో బీఆర్‌ఎస్ (BRS) ధనిక పార్టీలుగా మారాయన్నారు. రూ.16 వేల కోట్లతో విమానాలు, అదాని రుణాలు మాఫీ చేసే మోడీకి పేదల రుణాల మాఫీ గుర్తుకు రాదని విమర్శించారు. కరోనా సమయంలో దేశ ప్రజలు అల్లాడితే మోడీ ఆదుకోవడంలో విఫలం అయ్యారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. రెండు లక్షల వరకు ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ 24 గంటలు పనిచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌కు బై బై చెప్పే సమయం ఆసన్నం అయిందని ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-28T14:23:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising